Site icon HashtagU Telugu

Apple CEO Tim Cook: స్టార్ షట్లర్లతో యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ బ్యాడ్మింటన్..!

Apple CEO Tim Cook

Resizeimagesize (1280 X 720)

యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ (Apple CEO Tim Cook) భారత్‌లోని స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల (Badminton Players)తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆటగాళ్లతో తీసిన చిత్రాలను కుక్ పంచుకున్నారు. ప్రత్యేక సందేశాన్ని కూడా రాశారు. సైనా నెహ్వాల్, శ్రీకాంత్ కిదాంబి, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ కూడా కుక్‌తో కలిసి ఫోటోలో ఉన్నారు.

కుక్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో చిత్రాలను పంచుకుంటూ.. “బ్యాడ్మింటన్ క్రీడలో భారతదేశాన్ని ముందు ఉంచడంలో గణనీయమైన కృషి చేసిన కోచ్ గోపీచంద్, బ్యాడ్మింటన్ ఛాంపియన్‌లు సైనా నెహ్వాల్, శ్రీకాంత్ కిదాంబి, చిరాగ్ శెట్టి, పారుపల్లి కశ్యప్‌లను కలవడం అద్భుతం” అని రాశారు.

కుక్ పంచుకున్న చిత్రాలలో ఆటగాళ్ళు అతనితో ఇంటరాక్ట్ అవుతున్నారు. దీనితో పాటు ఒక ఫోటోలో కుక్ కూడా అకాడమీలోని పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆటగాళ్ళు తమ అనుభవాన్ని టిమ్ కుక్‌తో పంచుకున్నారు. ఒక ఫోటోలో కుక్.. శ్రీకాంత్‌తో కలిసి బ్యాడ్మింటన్ పట్టుకుని కనిపించాడు. అదే సమయంలో రెండవ చిత్రంలో ఆటగాళ్లందరూ కలిసి నిలబడి కుక్‌తో మాట్లాడుతున్నారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న పిల్లలు కూడా టిమ్ కుక్‌ను కలవడంతో చాలా సంతోషంగా ఉందన్నారు.

Also Read: SRH vs MI: హోం గ్రౌండ్ లో సన్ రైజర్స్ కు ముంబై పంచ్

మరోవైపు యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఏప్రిల్ 18 మంగళవారం ఇండియా తొలి యాపిల్ స్టోర్‌ను ప్రారంభించారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో యాపిల్ తొలి రిటైల్ స్టోర్ ఏర్పాటైంది. టిమ్ కుక్ దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్‌కు విచ్చేశారు. 2016లో ఈయన భారత్‌కు వచ్చారు. యాపిల్ రెండో రిటైల్ స్టోర్ ఢిల్లీలో అందుబాటులోకి రానుంది. గురువారం రోజున దీన్ని ప్రారంభించనున్నారు.