APAAR Card: నూతన విద్యా విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి విద్యారంగంలో చాలా ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో కీలక అడుగు పడింది. దీని కింద ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రత్యేక గుర్తింపు కార్డును (APAAR Card) సిద్ధం చేయనున్నారు. ఈ ID ఖచ్చితంగా ఆధార్ కార్డ్ లాగా ఉంటుంది. ఇందులో విద్యార్థుల పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ID పేరు APAAR ID. APAAR పూర్తి అర్థం ‘ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ’. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల్లోని విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. అపార్ నంబర్‌ను విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు అపార్ ఐడీ ఇవ్వనున్నారు. దీనిలో విద్యార్థి అకడమిక్ జర్నీ, చరిత్ర(విద్యా ప్రయాణం), విజయాలు నిక్షిప్తం అవుతాయని, అవసరమైన సమయంలో ట్రాక్ చేయొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
వన్ నేషన్, వన్ స్టూడెంట్స్ ఐడి కార్డు తయారీకి సంబంధించి మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు సూచనలను కూడా పంపింది. ఈ గుర్తింపు కార్డును తయారు చేయడం ద్వారా విద్యార్థులు కూడా ఎంతో ప్రయోజనం పొందనున్నారు. వారు పాఠశాలను మారలనుకుంటే లేదా ఏదైనా స్కీమ్ లేదా స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వీటన్నింటికీ వారు తమ అపార్ ఐడి కార్డును చూపించవలసి ఉంటుంది. ఆ తర్వాత వారి పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.
Also Read: Faked Death – 20 Years Later : 20 ఏళ్ల క్రితం చనిపోయాడు.. ఇప్పుడు అరెస్టయ్యాడు
We’re now on WhatsApp. Click to Join.
30 కోట్ల మంది విద్యార్థుల డిజిటల్ రిజిస్ట్రేషన్ అవసరం
దీనికి సంబంధించి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 29 జూలై 2023న అఖిల భారత విద్యా సదస్సులో (ABSS) చర్చను నిర్వహించింది. అదే సమయంలో దేశంలో 30 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారని, వారిలో దాదాపు 4.1 కోట్ల మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, మిగిలిన 4 కోట్ల మంది స్కిల్ డొమైన్‌కు చెందినవారని చెప్పారు. వీరంతా డిజిటల్‌గా నమోదు చేసుకోవడం తప్పనిసరి.
తల్లిదండ్రుల అనుమతి పొందడం తప్పనిసరి
అపార్ ఐడీ కార్డును తయారు చేసేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. దీని తర్వాతే ఈ పాఠశాల ఈ దిశగా ముందుకు సాగుతుంది. ఈ ID ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ID కార్డ్ లాగా ఉంటుందని, ఇది దేశం మొత్తం చెల్లుబాటు అవుతుంది.