Site icon HashtagU Telugu

ADR Report: దేశంలో సంపన్న సీఎంగా వైఎస్ జగన్మోహన రెడ్డి…

Adr Report

Adr Report

ADR Report: దేశ రాజకీయాలను డబ్బు శాసిస్తుందని చిన్న పిల్లాడిని అడిగినా అవుననే సమాధానం ఇస్తాడు. వార్డు మెంబర్ మొదలుకుని ముఖ్యమంత్రి స్థాయి వరకు డబ్బే ప్రధానంగా పని చేస్తుంటారు. ఇది ప్రజలు చెప్తున్న మాట. ఇది కాదనలేని సత్యం. చిన్న లీడర్ల సంగతి పక్కనపెడితే, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల సంపాదన, వారి ఆస్థి వివరాలు తెలుసుకుందాం.

దేశంలో 30 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. తాజాగా వారి ఆస్తులపై ఏడీఆర్ నివేదిక బయటపెట్టింది. ముప్పై మంది ముఖ్యమంత్రుల ఆస్తులపై ఏడీఆర్ ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా మొదటి స్థానంలో ఉన్నారు ఏపీ సీఎం జగన్. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ :510 కోట్లు . సీఎం జగన్ తర్వాత రెండవ స్థానంలో ఉన్నారు అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండూ. ఆయన చూపించిన మొత్తం ఆస్తుల విలువ రూ:163 కోట్లు. తర్వాతి స్థానంలో నవీన్ పట్నాయక్ ఉండగా, ఆయన ఆస్తుల విలువ 63 కోట్లుగా పేర్కొంది ఏడీఆర్. ఇందులో తక్కువ ఆస్థి కలిగిన ముఖ్యమంత్రిగా మొదటి స్థానంలో ఉన్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆమె ఆస్థి 15 లక్షలు మాత్రమే. ఆ తర్వాత కేరళ సీఎం పినారై విజయన్ ఆస్థి కోటి రూపాయలు. తర్వాత హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నారు. ఆయన ఆస్థి విలువ కోటి పైన. తమిళనాడు సీఎం స్టాలిన్ కు 3 కోట్లు, కాగా ఈ ముప్పై మంది సీఎంలలో 13 మంది పైన క్రిమినల్, కిడ్నప్, అత్యాచార కేసులు ఉన్నాయి . అంటే నాన్ బెయిలబుల్ శిక్షలు. తప్పు అని రుజువు అయితే ఆ సీఎంలకు ఐదేళ్లకు పైగా శిక్ష పడుతుంది.

Read More: Rich BRS : ఏడాదిలో 5 రెట్ల ఆదాయం! ఖాతాలో రూ. 218 కోట్లు, కంట్రీ నెంబ‌ర్ 1