కర్ణాటక ఎన్నికల (Karnataka Election)పై ఏపీ సీఎం ప్రభావం పడనున్నది. ఆయన చేస్తున్న పాలనకు ఢిల్లీ బాస్ మద్దతు ఉందని, ఆ బాస్ కు బుద్ధి చెప్పడానికి సరైన సమయం వచ్చిందని వాట్స్ అప్ గ్రూపులో వైరల్ అవుతున్న మెసేజ్. ఆ మెసేజ్ సారాంశం ఏమంటే ఏపీలోని ఒక సామాజిక వర్గం మీద , వాళ్ళ వ్యాపారాల మీద దాడులు చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. అందుకే జగన్ కి మద్దతు ఇస్తున్న పెద్దకు వ్యతిరేకంగా ఓటు వేయాలని సందేశం పంపుతున్నారు. అది యధాతధంగా ఇలా ఉంది.
”ఆంధ్రప్రదేశ్ లో గత నాలుగు సంవత్సరాలుగా ఒక వర్గం వారిని ఏ విధంగా టార్గెట్ చేసి జగన్ ప్రభుత్వం హింస పెడుతున్నదన్న విషయం అందరికీ తెలిసినదే! రాజకీయ నాయకులను మాత్రమే కాదు అధికారులను, వ్యాపారస్తులను, సామాన్యులను సైతం ఫలానా వర్గం అనే కారణంగా ఆర్థికంగాను, సామాజికంగాను, సాంస్కృతికంగా వారిని అణగదొక్కటానికి అనుక్షణం ప్రయత్నిస్తున్న జగన్ ప్రభుత్వానికి కొండంత అండ ఎవరు?
ఒక వర్గం వారి వ్యాపారాలను, ఆర్థిక మూలాలను నాశనం చేయటానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్న వైఎస్సార్ పార్టీ నాయకులు వారిని ఏ విధంగానూ కోలుకోలేని విధంగా చేయాలని వైషమ్యాలు వ్యాప్తి చేస్తూ ఒక ప్రత్యేక వర్గం వారిని ఒంటరి చేయడానికి ప్రయత్నిస్తూ ఆర్థిక, రాజకీయ, సామాజిక అంటరాని వారిగా చిత్రిస్తున్న జగన్ రెడ్డి మరియు బృందానికి కొమ్ముకాస్తున్నది ఎవరు?
కొడాలి నాని, వల్లభనేని వంశీ, చంద్రశేఖర్ రెడ్డి, రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్, లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళతో అనుదినము ఒక వర్గం యొక్క రాజకీయ నాయకులను, వారి కుటుంబ సభ్యులను మరియు వారికి మద్దతునిచ్చే సామాన్య ప్రజలను అనరాని మాటలు అంటూ అనిపిస్తూ అను దినము వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్న దుర్మార్గులను ప్రేరేపిస్తున్న జగన్ రెడ్డికి వెన్నుదన్ను ఎవరు?
దివంగత ఎన్టీ రామారావు ఆరాధ్యుడు, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని మనతో పాటు కోట్లాదిమంది ప్రజలు విశ్వసిస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విజ్ఞాన పరిషత్ కు శ్రీ రామారావు గారి పేరును మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టిన మూర్ఖపు, అహంకారపు జగన్ రెడ్డి వెనుక ఉన్నది ఎవరు? బలం ఎవరిది? బలగం ఎవరిది?
ఒక వర్గం వారిపై అన్యాయంగా జగన్ రెడ్డి మరియు వాళ్ళ బృందం చేస్తున్న మానసిక, శారీరక దాడులకు కలత చెంది ఆ వర్గం లో పుట్టడమే తప్పా? అని తమను తాము ప్రశ్నించుకుని భయపడి బెంబేలు పడిపోతూ బెదరుచూపులు చూస్తున్న స్త్రీలు, పిల్లలు, విద్యార్థులు మరియు సామాన్యుల వేడి నిట్టూర్పులకు కారణం ఎవరు? వెనకున్న వెన్నుదన్ను ఎవరు?
విభజిత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కొరకు సకల జనుల రైతులతో పాటు తాము కూడా వేలాది ఎకరాల పంట భూమి ప్రభుత్వానికి ధారాధత్తం చేసిన వ్యవసాయదారులను వర్గం పేరుతో బహిరంగంగా కించపరుస్తూ, ఆడువారిని అవమానిస్తూ మీరు రైతులు కాదు బ్రోకర్లు! ఇది అమరావతి కాదు కమరావతి అని నేటికీ అవమానిస్తున్న జగన్ రెడ్డి రాక్షస పాలన వెనుక ఉన్న బలీయ శక్తి ఎవరు?
నిన్న గాక మొన్న జరిగిన నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన దక్షిణ భారత సూపర్ స్టార్ శ్రీ రజనీకాంత్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని విజనరీ లీడర్ అన్నందులకు వారిని నోటికి వచ్చినట్లు దూషిస్తున్న పిచ్చి కుక్కలు, గజ్జి కుక్కలు, బురద పందుల నోళ్లు ఇంతగా రెచ్చిపోవడానికి కారణం ఎవరు? వారి వెనుక బలం ఎవరు?
ఒక వర్గం వారిని రాజకీయంగా తొక్కి వేయాలని, నామరూపాలు లేకుండా చేయాలని వివిధ రకాల బోగస్ పోలీసు కేసులు పెడుతూ, అక్రమ కేసులలో బంధించి శారీరకంగా మానసికంగా నానా హింసలు పెడుతూ వారి ఆత్మస్థైర్యాన్ని కృంగదీయడానికి ప్రయత్నిస్తున్న జగన్ అండ్ గ్యాంగ్ వెనుక ఉన్నది ఎవరు?
Also Read: CM Jagan : నేడు వైఎస్‌ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
ఎవరు? ఎవరనేది ప్రతి ఒక్కరికి తెలుసు!
కర్ణాటక వాసులమైన మనకు ఇపుడు ఒక అపూర్వ అవకాశం వచ్చింది! అది ఏమంటే? మన ఓటు! ఆంధ్రప్రదేశ్ లో ఒక వర్గ వినాశనానికి ప్రయత్నిస్తున్నవారికిమరియు వారిని రకరకాలుగా అవమానాలకు గురి చేస్తున్న వారికి వెన్నుదన్నుగా ఉన్నవారిని ఓటు హక్కు ద్వారా శిక్షించే అవకాశం!
ఆంధ్రప్రదేశ్ లో అవమానాల పాలవుతున్నవారి కంటే ముందుగానే మనకు ఆ అవకాశం రావడం అంటే! ఇది మనందరి సుకృతం!
మే 10వ తారీఖున జరుగబోయే కర్ణాటక శాసనసభ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా మనమంతా మన ఓటుతో జగన్ గాడ్ ఫాదర్ కి బుద్ధి చెప్పాలి, వచ్చిన సదవకాశం సద్వినియోగం చేసుకోవలసిన పుణ్య దినం మే 10! ఈ అవకాశం చేజార్చుకోరాదు! సోదరులారా! రాబోయే తరాలు ఆత్మాభిమానం తో తల ఎత్తుకుని బ్రతకాలంటే మనమిప్పుడు మేల్కొవాలి. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం! ఆదేశం, ఈ దేశం! అని ఎంచవద్దు, ఎక్కడున్నా మనమంతా ఒక తల్లి బిడ్డలం, ఏ వర్గానికి అవమానం జరిగినా, అణగదొక్కబడుతున్నా మన నిరసనను ప్రజాస్వామ్య బద్దంగా వ్యక్తపరచాలి, లేదా భావితరాలు మనల్ని క్షమించబోవు.” అంటూ సందేశం మొబైల్ గ్రూపులకు వైరల్ గా పంపిస్తున్నారు. దీని ప్రభావంపై బీజేపీ ఆలోచనలో పడింది.