Rahul Gandhi : భారత బిలియనీర్, అదానీ గ్రూప్ సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదయిన విషయం తెలిసిందే. అయితే ఈక్రమంలోనే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. అదానీ స్కాములో ప్రమేయం ఉన్న అధికారులు, వ్యక్తులు, రాజకీయనాయకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ స్కాంలో అధికార పక్షమున్నా.. ప్రతిపక్షమున్నా అందరికీ ఒకేలా శిక్ష పడాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదానీ పెట్టుబడులపై ఓ లేడీ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. ఆ స్కాములో ఎవరున్నా( సీఎం రేవంత్).. ఎవరైనా అరెస్టు చేయాల్సిందేనని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కింగ్ పిన్ కేంద్రమే అని రాహుల్ ఆరోపించారు.
కాగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అదానీ లంచాల కుంభకోణం కుదిపేస్తోంది. విద్యుత్ ఒప్పందాలు, గ్రీన్ ఎనర్జీ, పవర్ ప్రాజెక్టుల్లో అధిక లాభాలు పొందేందుకు దేశంలోని కీలక స్థాయి అధికారులకు రూ.2,100 కోట్లను లంచాలుగా అదానీ కంపెనీ ముట్టజెప్పిందని అమెరికాకు చెందిన ఓ ఏజెన్సీ నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ స్కాం రిపోర్టును దేశాన్ని కుదిపేస్తోంది. ఈ అభియోగాల ప్రకారం, అదానీ కంపెనీ అధికారులకు లంచాలు ఇచ్చి, ఆ లంచాల గురించి ఇన్వెస్టర్లను తప్పుడు సమాచారం ఇచ్చి, నిధుల సేకరణకు ప్రయత్నించినట్లు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు పేర్కొంటున్నారు.
ఈ కారణంగా గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ సహా మరో ఏడుగురు వ్యాపారవేత్తలపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అదానీ గ్రూప్, దాని అనుబంధ సంస్థలు గత 20 ఏళ్లలో సుమారు 2 బిలియన్ డాలర్ల లాభాన్ని సాధించడానికి, భారత ప్రభుత్వ అధికారులకు 265 మిలియన్ డాలర్లు లంచాలు చెల్లించినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
Read Also: AAP : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం..తొలి జాబితా ప్రకటన..!