Vote in Jammu Kashmir: అక్కడ ఎవరైనా ఓటు వేయోచ్చు…ఎలాగో తెలుసా..!!

జమ్మూ కశ్మీర్ ఈ మధ్య కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి హిర్దేష్ కుమార్ చేసిన ప్రకటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Vote

Vote

జమ్మూ కశ్మీర్ ఈ మధ్య కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి హిర్దేష్ కుమార్ చేసిన ప్రకటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకూ ఎన్నికల అధికారి చేసిన ప్రకటన ఏంటంటే…జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఎవరైనా సరే ఓటు హక్కు వినియోగించుకోవచ్చని. భారత పౌరులు ఎవరైనా సరే….జమ్మూలో నివాసం ఉంటున్నా…పనిచేస్తున్నా ఓటరు జాబితాలోకి తమ పేరును నమోదు చేసుకోవచ్చని. అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ప్రకటించారు. సాయుధ దళాల్లో పనిచేస్తున్నవారు కూడా తమ పేర్లను ఓటరు లిస్టులో నమోదు చేసుకోవచ్చన్నారు.

అయితే ఎన్నికల అధికారి వ్యాఖ్యలను జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి చెందిన పలు రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి. కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ఎవరైనా వెళ్లి ఓటు వేయోచ్చంటే…ఒకే ఓటర్ పలు రాష్ట్రాల్లో ఓటు వేయవచ్చని అనుమతించినట్లుగా ఉందని విమర్శించాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం పౌరులు దేశంలో ఎక్కడైనా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అంతే తప్పా ఒకటికి మించిన రాష్ట్రాల్లో ఓటు వేయడానికి ఎలాంటి అనుమతి లేదు. ఒక వ్యక్తి ఒక రాష్ట్రంలో ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకుంటే…ఓటరు జాబితాలోకి చేర్చడానికి ముందు..ఆ వ్యక్తి మరెక్కడైనా పేరు నమోదు చేసుకున్నాడా అనేది రికార్డులను అధికారులు తనిఖీ చేస్తారు.

కాగా జమ్మూలో కొత్తగా 20 నుంచి 25 లక్షల మంది ఓటర్లు నమోదు అయినట్లు రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. 2019 జనవరి 1 తర్వాత అక్కడ ఓటర్ల జాబితా సవరణ చేయడం ఇదే మొదటిసారి…అంతేకాదు ఏడాదిలో నాలుగుసార్లు ఓటర్ల జాబితాలో పేరుకు దరఖాస్తు చేసుకునే విధానం అమల్లోకి వచ్చింది.

  Last Updated: 19 Aug 2022, 10:55 AM IST