8YouTube Channels Suspended: మోదీకి వ్యతిరేక ప్రచారం చేస్తారా..? మీ ఛానెళ్లు ఔట్..!!

కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎనిమిది యూట్యూబ్ ఛానెళ్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్.

  • Written By:
  • Publish Date - August 18, 2022 / 03:01 PM IST

కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎనిమిది యూట్యూబ్ ఛానెళ్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది. కాగా సదరు ఛానెళ్లు దేశ భద్రత విదేశీ వ్యవహారాలపై తప్పుడు ప్రచారం చేసినందుకు ఛానెళ్లపై వేటు వేసినట్లు కేంద్రం పేర్కొంది. నిషేధించిన ఛానెళ్లలో 7 భారత్ కు చెందినవి. ఒక ఛానెల్ పాకిస్తాన్ కు చెందినది.

కాగా…కేంద్రం అంతకుముందు కూడా 2021 ఐటీ రూల్స్ ఉల్లంఘిస్తున్నారన్న కారణంతో 22 యూట్యూబ్ ఛానెల్స్ ను మూడు ట్విట్టర్ అకౌంట్స్ , ఓ ఫేస్ బుక్ అకౌంట్ ఒక వార్త వెబ్ సైట్ ను నిషేధించింది. గతేడాది డిసెంబర్ నుంచి సామాజిక మాధ్యమాల్లో బ్లాక్ చేస్తున్న అకౌంట్ల సంఖ్య తాజాగా 102కు చేరింది. ఈ ఛానెళ్లు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్రం గుర్తించింది.

బ్లాక్ చేసిన ఎనిమిది యూట్యూబ్ ఛానెల్స్ కు దాదాపు 86 లక్షల మంది సబ్ స్కైబర్స్ ఉన్నారు. 114కోట్ల మంది వ్యూస్ అకౌంట్స్ ను కలిగి ఉన్నాయి. ఈ ఛానెల్స్ భారత్ లోని మత వర్గాల మధ్య విధ్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాయని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది.

కానీ కేంద్ర సర్కార్ చెబుతున్న వాదనలో పస లేదని మీడియా వర్గాలు అంటున్నాయి. కేవలం మోదీకి వ్యతిరేకంగా వస్తున్న వార్తల కారణంగానే ఇలా జాతీయ భద్రత అంశాన్ని లేవనెత్తారని మీడియా వర్గాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాల స్పందన ఏవిధంగా ఉంటుందో చూడాలి.