Anti India Graffiti : మరో హిందూ ఆలయంపై ఖలిస్తానీ మూకల పిచ్చిరాతలు

Anti India Graffiti : ఖలిస్తానీ తీవ్రవాద మూకలు మరోసారి అమెరికాలో బరితెగించారు.

  • Written By:
  • Updated On - January 5, 2024 / 11:23 AM IST

Anti India Graffiti : ఖలిస్తానీ తీవ్రవాద మూకలు మరోసారి అమెరికాలో బరితెగించారు. కాలిఫోర్నియాలోని హేవార్డ్‌లో ఉన్న ఒక హిందూ దేవాలయం గోడలు, నేమ్ బోర్డుపై పిచ్చి రాతలు రాశారు. భారత్‌కు వ్యతిరేకంగా, ఖలిస్తాన్ ఉద్యమానికి అనుకూలంగా నినాదాలు రాశారు. కాలిఫోర్నియాలోని నెవార్క్‌లో ఉన్న స్వామినారాయణ్ దేవాలయం గోడలపై ఖలిస్తానీల రాతల ఘటన చోటుచేసుకున్న రెండు వారాల్లోనే అలాంటిదే మరో ఘటన(Anti India Graffiti)  ఇప్పుడు చోటుచేసుకోవడం గమనార్హం. ఖలిస్తానీలు చెలరేగిపోతున్నా అమెరికా ప్రభుత్వం కట్టడి చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

హేవార్డ్‌లోని హిందూ దేవాలయంపై ఖలిస్తానీల పిచ్చిరాతల వ్యవహారాన్ని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ట్విట్టర్ (ఎక్స్) పోస్టు ద్వారా వెలుగులోకి తెచ్చింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని హేవార్డ్ ప్రాంతంలో ఉన్న విజయ్ షేరావాలి ఆలయంపై ఈసారి ఖలిస్తానీ తీవ్రవాదులు పిచ్చిరాతలతో దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. దీన్నిబట్టి అమెరికాలోని హిందువులకు ఖలిస్తానీల నుంచి పెరుగుతున్న ముప్పును అర్థం చేసుకోవచ్చని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో అమెరికాలోని హిందూ ఆలయాల్లో సెక్యూరిటీ కెమెరాలు, అలారం సిస్టమ్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిదని హిందూ అమెరికన్ ఫౌండేషన్ సూచించింది. స్థానిక అధికార యంత్రాంగాలు కూడా హిందూ ఆలయాలకు భద్రత పెంచాల్సిన అవసరముందని పేర్కొంది. ఈ ఘటనపై తాము ఆలయ నిర్వాహకులతో సంప్రదింపులు జరుపుతున్నామని, అలమెడ పోలీస్ డిపార్ట్‌మెంట్, పౌరహక్కుల విభాగంతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని ఫౌండేషన్ వెల్లడించింది.

Also Read: US vs Houthi : అమెరికా వార్నింగ్ తూచ్.. ఎర్రసముద్రంలో హౌతీలు తొలిసారి ఏం చేశారంటే..

మరోవైపు కెనడాలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడున్న హిందూ సముదాయం భయభ్రాంతులకు గురవుతోంది. ఉగ్రవాదులకు అమెరికా, కెనడాలు అడ్డాగా మారడం..  ఉగ్రవాదులకు పౌరసత్వాలు ఇస్తుండటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఖలిస్తానీ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. మరెంతో మంది ఖలిస్తానీ తీవ్రవాదులు కెనడాలో ఉన్నారు. ఇటువంటి తీవ్రమైన తప్పులు చేస్తున్న అమెరికా, కెనడాలు.. ఇటీవల భారత్‌ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేశాయి. కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసును భారత గూఢచార సంస్థ రాపై రుద్దే ప్రయత్నం చేశాయి. దీనిపై సహకరించాలంటూ భారత్‌కు ఆ రెండు దేశాలు నీతులు చెప్పాయి.