Site icon HashtagU Telugu

Kedarnath Yatra : కేదార్నాథ్ యాత్రలో మరో అపశ్రుతి..

Kedarnath Yatra2

Kedarnath Yatra2

ఉత్తరాఖండ్‌ కేదార్నాథ్ యాత్ర(Kedarnath Yatra )లో మరోసారి అపశ్రుతి చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా మార్గంలో భక్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నడక మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ ఘటనలో ఒక భక్తుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. దీంతో అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని ఆ మార్గంలో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

Success Man : ఒకప్పుడు హైదరాబాద్ లో కూలీ..ఇప్పుడు ఏడాదికి రూ. 5 కోట్లు సంపాదన..ఎలా అంటే..!!

ఇప్పటికే కేదార్నాథ్ దారిలో వర్షాలు భక్తులకు ప్రధాన అంతరాయం అవుతున్నాయి. శనివారం ఉదయం హెలికాప్టర్ కూలిన ఘటనలో ఏడు మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం ఇంకా మిగిలే ఉండగానే, ఇప్పుడు మరోసారి ప్రమాదం చోటు చేసుకోవడం యాత్రికుల మనోభావాలను కలిచివేసింది. వరుసగా ఎదురవుతున్న ప్రమాదాల వల్ల యాత్రికులు భయాందోళనకు గురవుతున్నారు.

ప్రభుత్వం ఎలాంటి అపశ్రుతి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటోంది. వాతావరణ శాఖ సూచనల మేరకు భద్రతా పరంగా రూట్ మూసివేయడం, ప్రత్యేక రక్షణ బృందాలను మోహరించడం, సి.సి. కెమెరాలు, డ్రోన్‌ పర్యవేక్షణ వంటి చర్యలు చేపడుతోంది. భక్తులు కూడా వాతావరణ సూచనలను పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.