AAP Leaders : మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లపై మరో కేసు

ఆప్ హయాంలో మొత్తంగా 12 వేల స్కూళ్లు, క్లాస్ రూంల నిర్మాణం చేపట్టగా అందులో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని తేల్చింది. దీనిపై నాటి ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ లపై కేసు నమోదు చేసింది.

Published By: HashtagU Telugu Desk
Another case against Manish Sisodia and Satyendar Jain

Another case against Manish Sisodia and Satyendar Jain

AAP Leaders : ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఢిల్లీ వ్యాప్తంగా ఆప్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పాఠశాలలు, క్లాస్ రూంల నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆరోపించింది. ఆప్ హయాంలో మొత్తంగా 12 వేల స్కూళ్లు, క్లాస్ రూంల నిర్మాణం చేపట్టగా అందులో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని తేల్చింది. దీనిపై నాటి ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ లపై కేసు నమోదు చేసింది.

Read Also: NSAB : పాక్‌తో కయ్యం వేళ ఎన్‌ఎస్‌ఏబీ పునర్ వ్యవస్థీకరణ.. ఛైర్మన్‌గా అలోక్‌ జోషి.. ఎవరు ?

ఆప్‌ ప్రభుత్వ హయాంలో సిసోదియా విద్యాశాఖ మంత్రిగా, సత్యందర్‌ జైన్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (పీడబ్ల్యూడీ) మంత్రిగా ఉన్నారు. వారి నేతృత్వంలో రూ.2వేల కోట్ల అక్రమాలు జరిగాయి. 34 మందికి దీని కాంట్రాక్టులు దక్కాయి. వారిలో చాలామందికి ఆప్‌తో దగ్గర సంబంధాలు ఉన్నట్లు తేలింది. నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తికాకపోగా, భారీగా ఖర్చు చేశారు. తరగతి గదులను 30 సంవత్సరాలకు ఉండేలా కడితే వాటికి అయిన ఖర్చు మాత్రం 75ఏళ్లు ఉండేలా అయ్యింది. గడువు ప్రక్రియను పాటించకుండా కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్‌లను నియమించుకోవడంతో దాదాపు ఐదు రెట్లు వ్యయం పెరిగిపోయింది. ఇక, బీజేపీ నేతల ఫిర్యాదుతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయని సమాచారం.

కాగా, ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో సిసోడియా, మనీ లాండరింగ్ ఆరోపణలపై సత్యేందర్ జైన్ లు జైలుకు వెళ్లి వచ్చారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలు బెయిల్ పై బయట ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వారిపై తాజా ఆరోపణలు, కేసు నమోదు కావడం ఆప్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇటీవల సెట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) ఇచ్చిన నివేదికలో తరగతి గదుల నిర్మాణ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని పేర్కొంది. కొత్త టెండర్లు తీసుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు వ్యయం రూ.326 కోట్లు పెరిగిందని రిపోర్టులో తెలిపింది. సిసోదియా, జైన్‌లను విచారించేందుకు మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో తాజాగా వీరిపై కేసు నమోదైంది.

Read Also: Telangana High Court : భూదాన్ భూముల కేసు.. ఐపీఎస్‌ అధికారులకు హైకోర్టులో చుక్కెదురు  

 

  Last Updated: 30 Apr 2025, 02:21 PM IST