Site icon HashtagU Telugu

Delhi Liquor Case : ఢిల్లీ మద్యం పాలసీ కేసు..మరో మంత్రికి ఈడీ నోటీసులు

Another Blow To AAP: Delhi Minister Kailash Gahlot Summoned By ED In Liquor Policy Case

Another Blow To AAP: Delhi Minister Kailash Gahlot Summoned By ED In Liquor Policy Case

Delhi Liquor Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో (Delhi Liquor Case) ఆప్‌ మరో మంత్రికి ఈడీ తాఖీదులిచ్చింది. సీఎం కేజ్రీవాల్‌ కేబినెట్‌లో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా కైలాశ్‌ గెహ్లాట్‌కు (Kailash Gahlot) నోటీసులు పంపింది. శనివారమే విచారణకు రావాలని అందులో స్పష్టం చేసింది. ఇదే కేసులో కేజ్రీవాల్‌ను ఈ నెల 21న ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

గెహ్లాట్‌ ప్రస్తుతం నజఫ్‌గంజ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2021-22 ఢిల్లీ మద్యం పాలసీ డ్రాఫ్ట్‌ను రూపొందించిన ప్యానల్‌లో ఆయన సభ్యుడిగా ఉన్నాడు. తన అధికార నివాసాన్ని ఆప్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌చార్జ్‌ విజయ్‌ నాయర్‌ వాడుకోవడానికి అనుమతించాడని, అదేవిధంగా గెహ్లాట్‌ తరచూ ఫోన్‌ నంబర్లు మార్చాడని ఈడీ ఆరోపిస్తున్నది. కాగా, ఇదే కేసులో కేజ్రీవాల్‌ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 1 వరకు ఆయన ఈడీ పరిధిలో ఉండనున్నారు. ఇప్పటికే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌, ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ జైలులో ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ముందు సంచలంగా మారింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ఈడీ.. ఈ నెల 21 వ తేదీన కేజ్రీవాల్‌ నివాసంలో సోదాలు నిర్వహించి.. ఆయనను అరెస్టు చేసింది. మొదట ఆయనను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచి.. ఈ నెల 28 వరకు కస్టడీలోకి తీసుకుంది. ఆ తర్వాత మరోసారి కోర్టులో ప్రవేశపెట్టడంతో కోర్టు ఏప్రిల్ 1 వ తేదీకి ఈడీ కస్టడీని పొడగించింది.

Read Also: Election King : 238 సార్లు ఎన్నికల్లో ఓడినా.. మళ్లీ పోటీ చేస్తున్న పద్మరాజన్‌!