Site icon HashtagU Telugu

India: ఇండియా కూటమికి మరో బిగ్ షాక్, మరో పార్టీ ఔట్

INDIA Alliance

INDIA Alliance

India: సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా  కూటమికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే నితీశ్ కుమార్ జారిపోగా…దీదీ కూటమిపై విమర్శన అస్త్రాలు ఎక్కుపెట్టింది. ఇప్పుడు తాజా కూటమి నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ బయటకు వెళ్లింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ చీఫ్ ఫారుక్ అబ్దుల్లా ప్రకటించారు. అంటే భవిష్యత్ లో తిరిగి ఎన్డీఏలో చేరనున్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు అత్యంత నమ్మకమైన భాగస్వామి చేయిజారిపోవడంతో..ఇక మిగిలిన కూటమి సభ్యులు ఏమాత్రం కలిసికట్టుగా ఉంటారన్నది ప్రశ్నార్థకమే. ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎన్నికల ముందు మరో ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జమ్ము, కశ్మీర్ కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ అలియన్స్ నుంచి బయటకు వచ్చింది.

లోక్ సభ ఎన్నికల్లో తిరిగి ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ఫారుక్ అబ్దుల్లా ప్రకటించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు లేకుండా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ స్వతహాగా పోటీ చేస్తామన్నారు.సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు ఏర్పడిన ఇండియా కూటమికి అనతికాలంలోనే బీటలు వారాయి. కూటమి నుంచి ఒక్కో కీలక పార్టీ బయటకు పోతోంది. ఇప్పటికే జేడీయూచీఫ్ ఎన్డీఏతో జతకట్టగా…మరో కీలక భాగస్వామి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. అటు అరవింద్ కేజ్రివాల్ సైతం కూటమిపట్ల సుముఖంగా లేరు.

ఇక అఖిలేష్ యాదవ్ సంగతి సరేసరి. ఇలా ఒక్కొక్కరూ కూటమి నుంచి బయటకు వెళ్లిపోతుండటంతో కాంగ్రెస్దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అయితే ఖచ్చితంగా తమతోనే ఉంటారని భావించిన మరో కీలక పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ సైతం చేయిచ్చింది. సీట్ల సర్దుబాటు, ప్రధాని అభ్యర్థిపై ఎటూ తేల్చకపోవడం వల్లే ఒక్కొక్కరూ పార్టీ వీడుతున్నట్లు సమాచారం. అయితే ఫారూక్ సైతం ఎన్డీఏలో చేరడం ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి.

Exit mobile version