Haryana election: హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బీజేపీ నేత, రాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ విజ్(Anil Vij) ముఖ్యమంత్రి పదవికి పెద్దపీట వేశారు. తానే సీఎం పదవికి పోటీదారునని ప్రకటించుకున్నారు. భవిష్యత్తులో సీఎం అభ్యర్థి ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు.
హర్యానా నుంచి సీఎం అభ్యర్థి ఎవరనేది బీజేపీ ఇంకా ప్రకటించకపోవడం గమనార్హం. ప్రస్తుత సీఎం నయాబ్ సైనీని కొందరు సీఎం అభ్యర్థిగా పేర్కొంటున్నారు. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. కాగా అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. అనిల్ విజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి నుండి సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేని మరియు 6 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని అన్నారు. ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు ఏడోసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను. ఇప్పటి వరకు నేను పార్టీని ఏమీ అడగలేదు. ఈసారి ఎన్నికలకు ముందు చాలా మంది వచ్చి నన్ను కలిసి సీఎం అభ్యర్థిగా ప్రమోట్ చేశారని చెప్పుకొచ్చారు.
హర్యానా ఎన్నికల్లో(Haryana elections) బీజేపీ విజయం సాధిస్తే నేనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నాను చెప్పారు అనిల్ విజ్.ఈ బాధ్యత అప్పగిస్తే నేను హర్యానా ముఖచిత్రాన్ని మారుస్తానని చెప్పాడు. కాగా బీజేపీ హైకమాండ్ విజ్‌కి అంబాలా కాంట్ నుండి టిక్కెట్ కేటాయించింది. అటు నిన్న ఆదివారం, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నాయబ్ సైనీని హర్యానా ముఖ్యమంత్రి ముఖంగా అభివర్ణించారు. ఆయన నాయకత్వంలోనే పార్టీ రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయాలు సాధిస్తుందని అన్నారు. నిజానికి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ఈ ప్రకటన అనివ్ విజ్ సీఎంగా ప్రకటించుకున్న తర్వాత వచ్చింది. కాగా ధర్మేంద్ర ప్రధాన్‌ను హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.
ఇదిలా ఉండగా హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తారో కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ చెప్పారు. హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తున్నదని చెప్పారు. ప్రచార కార్యక్రమాలకు భారీగా జనం వస్తున్నారన్నారు. 2005లో కాంగ్రెస్ పార్టీకి 67 సీట్లు రాగా, ఈసారి అంతకంటే ఎక్కువ ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు. ఈసారి 70 సీట్లకు పైగా గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
Also Read: Kriti Sanon: బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో మెరిసిపోతున్న కృతి సనన్