Site icon HashtagU Telugu

Anil Ambani: భారీగా పడిపోయిన అనిల్ అంబానీ సంపాదన.. ప్రస్తుత ఆస్తులు సున్నా అంటూ?

Best Hospitals

Best Hospitals

Anil Ambani : ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ధనవంతులలో ఒకరైన ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ గురించి మనందరికీ తెలిసిందే. ముఖేష్ అంబానీ లాగే అనిల్ అంబానీకి కూడా కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. అప్పుడు అనిల్ అంబానీ ఆసియాలోనే ధనవంతుల జాబితాలో ఒకరిగా నిలిచారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం అనిల్ అంబానీ సంపాదన భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే.. అనిల్ అంబానీ యునైటెడ్ కింగ్‌డమ్‌ లోని కోర్టులో తన ప్రస్తుత నికర విలువ రూ.0 అని వెల్లడించాడు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ రెండో రౌండ్ బిడ్డింగ్ వేలంలో హిందుజా గ్రూప్ అత్యధిక బిడ్డర్‌గా నిలిచింది.

దివాళా తీసిన కంపెనీని రూ. 9650 కోట్ల ఖర్చుతో కొనుగోలు చేయడానికి ఆఫర్ చేసింది. అయితే ముఖేష్ అంబానీ మాదిరిగానే పంచవ్యాప్తంగా ఉన్న అపర కుబేరుల జాబితాలో ఒకరిగా ఉన్న అనిల్ అంబానీ (Anil Ambani) 2020 ఫిబ్రవరిలో యూకే కోర్టులో హాజరైనప్పుడు తన నికర ఆస్తుల విలువ సున్నా అని తెలిపారు. నిజానికి ఆయన ఆస్తుల విలువ 13.7 బిలియన్ డాలర్లు అని నివేదికల ద్వారా తెలుస్తోంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది దాదాపు రూ. 1.12 లక్షల కోట్లకంటే ఎక్కువే అన్నమాట.

కానీ యూకే కోర్టులో అనిల్ అంబానీ తన ఆస్తులు అని చెప్పినప్పటికీ ముంబైలో 17 అంతస్థుల భవంతి, రూ. 20 కోట్ల విలువైన కార్లు, అత్యంత ఖరీదైన బోట్స్, ప్రైవేట్ జెట్స్ మొదలైనవి ఉన్నాయి. నికర ఆస్తుల విలువ భారీగా తగ్గినప్పటికీ, ప్రస్తుత ఆస్తులు దాదాపుగా రూ. 83 మిలియన్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. కాగా నిజానికి అనిల్ అంబానీ (Anil Ambani) వ్యాపార సామ్రాజ్యంలో ఒక శిఖరం, ఆసియాలో ఉన్న వ్యాపార ధనవంతులలో ఆరవ ధనవంతుగా ఎదిగారు. కానీ కంపెనీ నిధులను స్వాహా చేసిన ఆరోపణలకు గానూ సెబీ మార్కెట్ నుంచి నిషేదించింది. ఆ తరువాత క్రమంగా ఆయన నికర ఆస్తులు పతనం కావడం ప్రారంభం అయ్యాయి.

Also Read:  Mahesh Babu: సమ్మర్ ఎఫెక్ట్.. ఫ్యామిలీతో కలిసి విదేశాలకు మహేశ్ బాబు!