Site icon HashtagU Telugu

Anant Ambani Wedding : అంబానీ ఇంట్లో గ్రాండ్‌గా ‘మామెరు’ వేడుక

Anant Ambani Wedding Mameru

Anant Ambani Wedding : పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి జులై 12న జరగనుంది. అయితే ఇందుకు సంబంధించిన వేడుకలు బుధవారం నుంచే మొదలయ్యాయి. బుధవారం రోజు ముంబైలోని ముకేశ్ అంబానీ నివాసం యాంటీలియా వేదికగా ‘మామెరు’ వేడుక జరిగింది. ఈ గుజరాతీ సంప్రదాయ వివాహ వేడుకను వరుడు అనంత్‌ అంబానీ, వధువు రాధికా మర్చంట్ కుటుంబ సభ్యుల సమక్షంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబానీ(Anant Ambani Wedding) కుటుంబ సభ్యులంతా ఎంతో ఉత్సాహంగా కనిపించారు. పిల్లాపెద్దలతో ముకేశ్ అంబానీ ఉత్సాహంగా గడిపారు.

We’re now on WhatsApp. Click to Join

అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ పుట్టింటి వారు మామెరు వేడుకలో ముఖ్యపాత్ర పోషించారు. నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, ఆమె చెల్లి మమతా దలాల్ ముకేశ్ అంబానీ ఇంటికి వచ్చి.. అనంత్ అంబానీకి బహుమతులు అందించి ఆశీర్వాదం అందజేశారు. వధువు రాధికా మర్చంట్ మేనమామ కుటుంబ సభ్యులు కూడా ముకేశ్ అంబానీ ఇంటికి వచ్చారు.  వీరంతా కలిసి అనంత్, రాధికలను ఆశీర్వదించి గిఫ్టులను ఇచ్చారు.

జులై 12, 13, 14  తేదీల్లో అనంత్ అంబానీ పెళ్లి  జరగనుంది. జులై 12న శుభ్‌ వివాహ్‌ వేడుక జరగనుంది. జులై 13న శుభ్‌ ఆశీర్వాద్‌ కార్యక్రమం ఉంటుంది. ఈ రెండు వేడుకలకు అతిథులు భారతీయ సంప్రదాయ దుస్తులతో రానున్నారు. జులై 14న మంగళ్‌ ఉత్సవ్‌ వేడుక జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అతిథులు ఇండియన్ చిక్ డ్రెస్ ధరించి వస్తారు. అనంత్ పెళ్లి నేపథ్యంలో జులై 2న పేద కుటుంబాలకు చెందిన 50 జంటలకు సామూహిక పెళ్లిళ్లు నిర్వహించారు. వధువులకు బంగారు మంగళసూత్రం, ఉంగరాలు, ముక్కుపుడక, వెండి మెట్టెలు, పట్టీలను ఇచ్చారు. వీటన్నింటితో పాటు వధువుకు రూ.1.01 లక్షల చెక్కును అందజేశారు.

Also Read :Vijayawada : అర్ధరాత్రి అరకట్టపై పీసీబీ, మైనింగ్ పత్రాల కాల్చివేత ..