Site icon HashtagU Telugu

Anant Abani Watch : వైరల్ గా మారిన అనంత్ చేతి వాచ్..

Anant Abani Watch

Anant Abani Watch

గత రెండు రోజులుగా అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ (Anant Ambani Watch Pre Wedding) వేడుక గురించే అంత మాట్లాడుకుంటున్నారు. మార్చి 1న గుజరాత్‌లోని జామ్‌నగర్‌(Jamnagar)లో చాలా కోలాహలంగా ఈ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారతదేశంతోపాటు విదేశాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు హాజరై సందడి చేసారు. ప్రపంచం నలుమూలల నుంచి హాజరైన ప్రముఖులు, బిలియనీర్ల కోసం పసందైన వంటకాలతోపాటు పాప్‌సింగర్ రిహన్నా, అరిజీత్‌సింగ్, దిల్జీత్ దోసాంజ్, అజయ్-అతుల్ వంటివారితో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. బాలీవుడ్ స్టార్ నటులు షారుఖ్, సల్మాన్‌ ఖాన్, ఆమిర్‌‌ఖాన్ వంటి స్టార్ల డ్యాన్సులతో స్టేజి దద్దరిల్లింది. RRR సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు డాన్సర్లుతో కలిసి వేసిన స్టెప్పులకు ఆహూతులు మైమరచిపోయారు. ముగ్గురు ఖాన్‌లు ఒకే వేదికపై కాలు కదిపిన మధుర క్షణాలను చూసి అందరూ మైమరిచిపోయారు.

We’re now on WhatsApp. Click to Join.

రెండోరోజు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్‌లో భాగంగా అనంత్ అంబానీ(Anant Ambani) ప్రసంగానికి ముఖేష్ అంబానీ(Mukesh Ambani) భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న సమయంలో తనకు అండగా నిలిచిన తండ్రి ముఖేష్ అంబానీ, తల్లి నీతా అంబానీకి అనంత్ కృతజ్ఞతలు తెలిపారు. అది విన్న ముఖేష్ అంబానీ భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుండగా.. అయితే ఈవెంట్లో అనంత్ అంబానీ ధరించిన వాచ్లు ఆకట్టుకుంటున్నాయి. మెటా సీఈవో మార్క్ భార్య సైతం ఆయన ధరించిన వాచ్కు ఫిదా అయ్యారు. అయితే వాటి విలువెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. వీటిలో ‘పాటెక్ ఫిలిప్’ కంపెనీకి చెందిన రూ.63 కోట్ల వాచ్తో పాటు ‘రిచర్డ్ మిల్లే’ కంపెనీకి చెందిన రూ.14 కోట్ల వాచ్ ఉండటం విశేషం. మరి అంబానీ కొడుకు పెళ్లి వేడుక అంటే ఏమాత్రం రిచ్ గా ఉండబోతే ఎలా అంటూ అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : Old City Metro: ఎట్టకేలకు ఓల్డ్ సిటీకి మెట్రో.. 7న సీఎం శంకుస్థాపన

Exit mobile version