Site icon HashtagU Telugu

Anant Ambani : అనంత్ అంబానీ పాదయాత్ర ..అంత అవసరం ఏంటి..?

Anant Ambani Padayatra

Anant Ambani Padayatra

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్‌ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) గుజరాత్‌లోని జామ్‌నగర్ (Jamnagar (Gujarat)) నుంచి ద్వారక (Dwarka) వరకు కాలినడకన పాదయాత్ర చేస్తున్నాడు. ఈ రెండు నగరాల మధ్య దూరం 140 కిలోమీటర్లు ఉండగా, అనంత్ రోజుకు సుమారు 20 కిలోమీటర్లు నడుస్తున్నట్లు సమాచారం. ఆయన ధార్మిక భావనతో ఈ యాత్ర చేపట్టారని, ద్వారకనాథుని దర్శనం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.

Hyderabad : విదేశీ యువతిపై లైంగిక దాడి

అనంత్ అంబానీ ఈ ప్రయాణాన్ని రాత్రి వేళల్లో కొనసాగిస్తున్నారు. తన వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఉండేందుకు భారీ భద్రత నడుమ రాత్రిపూట నడక సాగిస్తున్నారు. భక్తి మార్గంలో నడిచే ఈ యాత్ర ద్వారా ఆయన విశేషమైన భక్తిభావాన్ని ప్రదర్శిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఆయన ఆరోగ్య కారణాల రీత్యా నడకను ప్రతిరోజూ నియమంగా చేసుకున్నారని, ఇది ధార్మికతతో పాటు ఫిట్‌నెస్‌ను మెరుగుపరచే లక్ష్యంగా కూడా ఉందని అంటున్నారు.

Conocarpus Trees: కోనోకార్పస్ చెట్లపై అసెంబ్లీలో చర్చ.. ఎందుకు ? ఏమైంది ?

ఈ యాత్రను ఏప్రిల్ 10న తన పుట్టినరోజు నాటికి పూర్తి చేయాలని అనంత్ భావిస్తున్నారు. ద్వారక చేరుకున్న తర్వాత శ్రీకృష్ణుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ధార్మిక విశ్వాసాలు, ఆధ్యాత్మిక చింతనలో ఆయన మునిగిపోయినట్లు అనిపిస్తోందని, ఈ యాత్ర అనంత్ అంబానీ భక్తిభావాన్ని స్పష్టం చేస్తుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.