Anant-Radhika Wedding: అనంత్ మరియు రాధికల వివాహ రిసెప్షన్ గ్రాండ్ గా ముగిసిన తర్వాత, అంబానీ కుటుంబం లండన్‌లో తమ స్నేహితులు మరియు బంధువులతో వివాహాన్ని జరుపుకోనుంది. ఇక్కడ సుదీర్ఘ వివాహ వేడుక ఉంటుంది. వారం రోజుల్లో అంబానీ ఫ్యామిలీ లండన్ వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. ఈరోజు కొత్తగా పెళ్లయిన జంట జియో వరల్డ్ సెంటర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్‌ను నిర్వహిస్తున్నారు. దీనికి చాలా మంది పెద్దలు హాజరవుతారు.
వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ,రాధిక మర్చంట్‌ల వివాహం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. అనంత్, రాధిక పెళ్లిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జులై 14న జరిగే వెడ్డింగ్ రిసెప్షన్‌తో అనంత్, రాధికల వెడ్డింగ్ ఫంక్షన్‌లు ముగుస్తాయని అంతా భావించారు, కానీ ఈ వివాహ వేడుకలకు ఇప్పుడే ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. ముంబై తర్వాత లండన్‌లో కూడా అనంత్, రాధికల పెళ్లి వేడుకకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి.
అనంత్ అంబానీ , రాధికా మర్చంట్‌ల నిశ్చితార్థం గతేడాది జనవరిలో ఘనంగా జరిగింది. ఈ ఏడాది మార్చి నెలలో అనంత్, రాధికల వివాహ వేడుకలు జామ్‌నగర్‌లో ప్రారంభమయ్యాయి. జామ్‌నగర్‌లో మూడు రోజుల వేడుక తర్వాత, యూరప్‌లో నాలుగు రోజుల క్రూయిజ్ పార్టీ జరిగింది. దీని తరువాత జూలై 5 నుండి భారతదేశంలో ఈ జంట వివాహ వేడుకలు జరుగుతున్నాయి. చివరగా జూలై 12న ఆచారాల ప్రకారం ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. అయితే ఈ వేడుక ఇక్కడితో ముగియదు. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ముంబై తర్వాత అంబానీ ఫ్యామిలీ అనంత్-రాధికల పెళ్లిని లండన్ లోనే జరుపుకోనుంది.
Also Read: CM Revanth Reddy : ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం రేవంత్‌కి రాజకీయంగా లాభిస్తుంది..!