భారతీయ దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంట త్వరలో పెళ్లి భాజాలు మొగనున్నాయి. రిలయన్స్ చైర్‌పర్సన్ ముఖేష్ అంబానీ (Anant Ambani), నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో అనంత్ అంబానీ నిశ్చితార్థం గురువారం జరిగింది. రాజస్థాన్‌లోని (Rajasthan) నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయంలో నిశ్చితార్థం జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్ నుండి 48 కిలోమీటర్ల దూరంలో నాథద్వారాలో అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది.
అనంత్, రాధిక చాలా సంవత్సరాలుగా రిలేషన్‌షిప్‌లో (Relationship) ఉన్నారు. అంబానీ కుటుంబం హోస్ట్ చేసే అన్ని ఈవెంట్‌లలో రాధిక కనిపిస్తుంది. ముకేశ్, నీతా అంబానీ కుమార్తె ఇషా అంబానీ (కవలలు) భర్త ఆనంద్ పిరమల్‌తో కలిసి యుఎస్ నుండి ముంబైకి వెళ్లిన కొద్ది రోజులకే అనంత్, రాధిక నిశ్చితార్థం చేసుకున్నారు.
రాధిక మర్చంట్ ఎవరు?
రాధిక ఎన్‌కోర్ హెల్త్‌కేర్ CEO. ఈమె వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ కుమార్తె.
రాధిక ముంబైలోని కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మొండియాల్ వరల్డ్ స్కూల్‌లో చదువుకున్నారు.
ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ వెళ్లింది.
రాధిక న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుండి రాజకీయాలు, ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రురాలైంది.
ఆమె శాస్త్రీయ నృత్యకారిణి, ముంబైలోని శ్రీ నిభా ఆర్ట్స్ డ్యాన్స్ అకాడమీకి చెందిన గురు భవన్ థాకర్ వద్ద శిక్షణ పొందింది.
ఈ సంవత్సరం ప్రారంభంలో, అంబానీలు ముంబైలో రాధిక మర్చంట్ కోసం ఆరేంజ్‌ట్రామ్ వేడుకను నిర్వహించారు.
Rajasthan | Anant Ambani visited Shrinathji Temple in Nathdwara, Rajasmand district. pic.twitter.com/ZWKGYn1ON0
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 29, 2022
Also Read : ICICI Bank Fraud: పోలీసుల కస్టడీకి చందా కొచ్చర్ దంపతులు, వేణుగోపాల్ ధూత్!