Site icon HashtagU Telugu

Parliament : పార్లమెంట్ లో భద్రత వైఫల్యం ..టియర్ గ్యాస్ వదిలిన ఆగంతుకులు

2 Visitors Jump Into Lok Sabha Chamber

2 Visitors Jump Into Lok Sabha Chamber

లోక్ సభ (Parliament )లో మరోసారి భద్రత (Security ) వైఫల్యం చోటుచేసుకుంది. లోక్ సభ జరుగుతుండగా..ఇద్దరు ఆగంతుకులు లోనికి చొరబడ్డారు. ఒక్కసారిగా టియర్ గ్యాస్ వదిలి భయాందోళనలను సృష్టించారు. ఈ గందరగోళంతో ఎంపీలు భయపడి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. లోక్ సభ సెక్యూరిటీ వైఫల్యం వల్లే దుండగులు లోపలికి ప్రవేశించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిటర్స్ గ్యాలరీ నుంచి ఆ ఇద్దరు లోనికి వచ్చినట్లు వీడియోలో కనిపిస్తుంది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ ఇద్దరి ఆగంతుకులను పట్టున్నారు. దుండగుల వద్ద ఆయుధాలు కూడా ఉండి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత భద్రత ఉండే పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించడమే కష్టం కాగా.. ఈ దుండగులు ఇద్దరు పార్లమెంట్ లోపలికి ప్రవేశించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. లోక్ సభ సెక్యూరిటీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనూహ్య పరిణామంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

ఇక ఇదే రోజు 2001 డిసెంబర్ 13 న సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంటు పై దాడి చేసారు. ఈ ఉగ్రవాదులు లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలకు చెందినవారు. భద్రతా దళాలు వీరిని సమర్ధవంతంగా ఎదుర్కొని, దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదుల్నీ హతమార్చారు. ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఒక సీఆర్‌పీఎఫ్ మహిళతో పాటు, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి – మొత్తం తొమ్మిది మంది అమరులయ్యారు. ఈ దాడికి కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది అఫ్జల్ మహ్మద్‌కు భారత సుప్రీం కోర్టు ఉరిశిక్షను విధించింది. సరిగ్గా 22 ఏళ్ల (22 Years After Terror Attack) తర్వాత మళ్లీ ఇదే రోజు పార్లమెంట్ లోకి ఆగంతుకులు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పార్లమెంట్ లో మోడీ లేరు.

Read Also : బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి పై ఎస్సీ , ఎస్టీ కేసు నమోదు