Savita Pradhan: ఓ IAS సక్సెస్ స్టోరీ..చదివితే కన్నీళ్లు ఆగవు..!

  • Written By:
  • Publish Date - April 29, 2024 / 01:15 PM IST

Savita Pradhan IAS Story: జీవితం అంటే నిజంగా మాటలు కాదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాలి…! సినిమాల్లో చూపించినట్టుగా….ఎవరికి అంత ఈజీ లైఫ్ ఉండదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు మనం చదవబోయే… IAS అధికారి జీవితం కూడా ఇలాంటిదే..! ఆవిడే ఎవరో కాదు… సవిత ప్రధాన్…! మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ డివిజన్‌లో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈవిడ జీవితం చాలా కష్టాలతో సాగింది. మండై గ్రామంలో పుట్టిన సవిత… ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చదువును ఆపడం ఇష్టం లేక…. స్కాలర్షిప్‌లతోనే చదివింది. వారి గ్రామంలో పదో తరగతి పూర్తి చేసిన మొదటి అమ్మాయిగా…సవిత ప్రధాన్ నిలిచింది.

విద్యాభ్యాసం:పాఠశాల ఎంతో దూరంగా ఉండటం వల్ల.. సవిత స్కూల్‌కు దగ్గర్లో ఒక చిన్న ఉద్యోగం చూసుకుంది సవిత తల్లి. సవితకు సైన్స్ అంటే ఎంతో ఇష్టం. పెద్ద అయిన తర్వాత డాక్టర్ అవ్వాలని అనుకుంది. ఇక్కడ వరకు అంతా బానే ఉంది. ఈమెకు 16 సంవత్సరాల వయసులో.. ఒక పెళ్లి సంబంధం వచ్చింది. సవిత కన్నా 11 సంవత్సరాలు పెద్ద. అయితే పెళ్లి చూపుల్లోనే ఎంతో దురుసుగా ప్రవర్తించాడని… సవిత వద్దని చెప్పిందట. కానీ..ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. పెద్దింటి వారు…అలాగే ఉంటారని నచ్చజెప్పారట. ఆమెకు అత్తింట్లో చాలా ఇబ్బందులు వచ్చాయట. అందరూ తిన్న తర్వాతనే తినాలి. తినడానికి ఏం లేకపోతే మళ్లీ వండుకోకూడదు. బయటికి వెళ్లకూడదు. తల మీద కొంగు తీయకూడదు. ఎక్కువగా నవ్వకూడదని, టీవీ చూడొద్దని చాలా నిబంధనలు పెట్టారు. అత్తవారింట్లో చెప్పిన కండీషన్స్‌లో…ఏ ఒక్కటి తప్పినా సరే.. భర్త చేతిలో తన్నులు మస్ట్‌గా ఉండేవట. ఇవన్నీ భరించలేక చనిపోదాం అనుకుందట సవిత. కానీ అదే సందర్భంలో ఆమె గర్భవతి అని తెలియడంతో తల్లికి విషయం చెప్పిందట. కానీ బిడ్డ పుట్టాక అన్ని పరిస్థితులు సర్దుకుంటాయని నచ్చజెప్పిందట తల్లి. ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా పరిస్థితి మారలేదట.

చనిపోదామని అనుకుంది:

పరిస్థితులు భరించలేక ఒకరోజు ఫ్యాన్‌కు చీరను కట్టుకుని చనిపోవాలని ప్రయత్నించింది. కిటీకీలో నుంచి అత్త,మామ చోద్యం చూస్తూ కూడా…. కనీసం అదేం పని అని వద్దని చెప్పలేదట. అందుకే ఇలాంటి వారి మధ్య… తన జీవితం నాశనం చేసుకోవడం ఇష్టం లేక…సవిత అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంట్లో నుంచి వెళ్లిపోయాక… ఈమె ఎక్కడుంటే అక్కడికి వెళ్లి కొట్టేవారట అత్తింటి వారు. అత్తింటి వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేసి…భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మరొక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది సవిత. హర్ష అనే ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత… ఈమె జీవితంలో మార్పు వచ్చిందట.

also read:

యూట్యూబ్ ఛానెల్ ప్రారంభం: హిమ్మత్ వాలి లడికియా పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసారు. తన జీవితం గురించి అందులో చెప్తూ… చాలా మందికి ధైర్యాన్ని ఇచ్చింది. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయట. దీంతో ఒక బ్యూటీ పార్లర్ లో అసిస్టెంట్‌గా పని చేసింది. ఇంట్లో వంట పనులు చేయడమే కాకుండా… చిన్న పిల్లలకు ట్యూషన్స్ కూడా చెప్తూ ఎంతో కొంత డబ్బులు సంపాదించేది. ఇవన్నీ చేస్తూనే బీఏ పరీక్షలు కూడా రాసింది. ఆ తర్వాత ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసింది. ఈమె తల్లి కూడా సహాయం చేయడంతో… ఒకసారి యూపీఎస్సీ నోటిఫికేషన్‌ కనిపించడంతో.. అది చూసి సాధించాలి అని కష్టపడి చదివింది. అలా..అలా… 24 సంవత్సరాలకే మున్సిపల్ ఆఫీసర్ అయింది. అప్పటి నుంచి సవిత జీవితం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. ఆవిడ కథ విన్నాక…. ఆమెలాగా బతకాలని చాలా మంది అనుకుంటున్నారు కూడా..!