Rajasthan: బాలనేరస్థుడికి మరణశిక్ష.. 25 ఏళ్ల తర్వాత పొరపాటు గుర్తించి విడుదల

బాలనేరస్థులకు మరణశిక్ష విధించరు. వారికి గరిష్టంగా మూడేళ్ల శిక్ష మాత్రమే ఉంటుంది. కానీ పోలీసులు పేరు, వయస్సుకు సంబంధించిన వివరాలను రాంగ్ గా ఎంటర్

Rajasthan: బాలనేరస్థులకు మరణశిక్ష విధించరు. వారికి గరిష్టంగా మూడేళ్ల శిక్ష మాత్రమే ఉంటుంది. కానీ పోలీసులు పేరు, వయస్సుకు సంబంధించిన వివరాలను రాంగ్ గా ఎంటర్ చేసుకోవడం వల్ల చేతన్‌రామ్‌ అనే ఒక బాల నేరస్థుడికి కోర్టు 25 ఏళ్ల క్రితం మరణ శిక్ష విధించింది. ఆయనను వయోజనుడిగా భావించి హత్య కేసులో ఈ శిక్షను వేశారు. చాలా ఆలస్యంగా ఈ తప్పును సుప్రీం కోర్టు గుర్తించింది. హత్య జరిగిన సమయంలో చేతన్‌రామ్‌ టీనేజర్‌ అని ధ్రువీకరిస్తూ ఈ ఏడాది మార్చిలో జైలు నుంచి విడుదల చేసింది.

■చేతన్‌రామ్‌ ఎవరు?

చేతన్‌రామ్‌ ది రాజస్థాన్‌లోని జలబ్సర్ గ్రామం.ప్రస్తుతం అతడి వయస్సు 41 ఏళ్లు. ఇటీవలే ఆయన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జైలు నుంచి ఇంటికి వచ్చారు. చేతన్‌రామ్ 28 ఏళ్ల 6 నెలల 23 రోజుల పాటు కస్టడీలోనే గడిపారు. అంటే మొత్తం 10,431 రోజులు ఆయన జైలులో ఉన్నారు. 18 ఏళ్లు నిండకముందే చేతన్‌రామ్‌కు శిక్ష పడింది.

■ ఏ కేసులో శిక్ష వేశారు ?

పుణేలో ఏడుగురిని హత్య చేసిన కేసులో చేతన్‌రామ్‌కు మరణశిక్ష విధించారు. 1994లో జరిగిన ఈ ఘటనలో అయిదుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు హత్యకు గురయ్యారు.ఈ కేసులో మరో ఇద్దరితోపాటు చేతన్‌రామ్‌ ను
పోలీసులు అరెస్ట్ చేశారు.ఆయన వయస్సును 20 ఏళ్లుగా భావించి 1998లో మరణశిక్షను వేశారు.
చేతన్‌రామ్ దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు మార్చి నెలలో సుప్రీం కోర్టు తెరదించింది.
ఈ 30 ఏళ్లలో ఆయన కేసు మూడు కోర్టుల చుట్టూ తిరిగింది. లెక్కలేనన్ని విచారణలు జరిగాయి. చట్టాలు మారాయి. అప్పీళ్లు, క్షమాబిక్ష పిటిషన్, వయస్సు నిర్ధరణ పరీక్షలు, ఆయన పుట్టినతేదీ పత్రాల కోసం అన్వేషణ వంటి ప్రయత్నాలు చేశారు.నేరం జరిగినప్పుడు చేతన్‌రామ్ వయస్సు 12 ఏళ్ల 6 నెలలు అని
ఎట్టకేలకు ఇటీవల జడ్జిలు తేల్చారు.

■జరిగిన పొరపాటు ఇదీ..

అరెస్ట్ సమయంలో పోలీసులు తయారు చేసిన మెమోలో చేతన్‌రామ్ పేరును నారాయణ్ అని రాశారు. జనన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వల్ల చాలామంది భారతీయులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి తాము ఏ తేదీన, ఏ సంవత్సరంలో పుట్టారో తెలియదు. అలాంటి వారిలో నిరాణారామ్ కూడా ఒకరు.పాఠశాలలోని ఒక పాత రిజిస్టర్ చివరకు ఆయనను కాపాడింది. నిరాణారామ్ చదివిన పాఠశాలలోని ఆ రిజిస్టర్‌లో 1982 ఫిబ్రవరి 1న చేతన్‌రామ్
జన్మించినట్లు రాసి ఉంది.టీసీలో కూడా పాఠశాలలో చేరిన రోజు, పాఠశాల నుంచి బయటకు వెళ్లిన తేదీల ప్రస్తావన ఉంది. పోలీసులు అరెస్ట్ చేసిన నారాయణ్ అనే వ్యక్తే నిరాణారామ్ అని ధ్రువీకరిస్తూ గ్రామ మండలి అధ్యక్షుడు రాసిచ్చిన పత్రం కూడా ఉంది. నిరాణారామ్ తండ్రి రైతు. తల్లి గృహిణి.

■హత్యల సంగతి ఏంటి? జైలులో ఏం జరిగింది?

నేరానికి సంబంధించి కూడా తనకేం గుర్తుకు లేదని చేతన్‌రామ్ చెప్పాడు. తనని న పోలీసులు ఎందుకు పట్టుకున్నారో కూడా తెలియదన్నాడు. అరెస్ట్ చేశాక వారు నన్ను కొట్టింది మాత్రం గుర్తుందని తెలిపాడు. పోలీసులు తనతో చాలా పేపర్లపై సంతకాలు పెట్టించుకున్నారని చేతన్‌రామ్
చెప్పారు.. కాగా, 12 ఏళ్ల బాలుడు ఇంతటి ఘోరమైన నేరాన్ని చేయగలడా? అని గత నెలలో ఆయన విడుదల సందర్భంగా సుప్రీం కోర్టు పోలీసులను ప్రశ్నించింది.జైలులో ఉంటూనే చదువుకుంటూ పరీక్షలు రాసి పాఠశాల విద్యను పూర్తి చేసినట్లు చేతన్‌రామ్ వెల్లడించారు. సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ కూడా తీసుకున్నారు.జైలు నుంచి విడుదలయ్యే సమయంలో ఆయన పొలిటికల్ సైన్స్ చదవడం కోసం సన్నద్ధం అవుతున్నారు.ఏదో ఒక రోజు విడుదలైతే భారత్ మొత్తం తిరగాలని అనుకున్నట్లు చెప్పారు. అందుకే టూరిజం స్టడీస్‌లో ఆరు నెలల కోర్సును చదివినట్లు తెలిపారు.‘గాంధీయన్ థాట్స్’పై కోర్సు చేయడంతో పాటు జైలులో ఉన్నప్పుడు పుస్తకాలే తనకు మంచి స్నేహితులని ఆయన చెప్పారు.