Site icon HashtagU Telugu

Breaking : కూలిన ఆర్మీ హెలికాప్టర్.. బిపిన్ రావత్ కు ప్రమాదం!

Bipin

Bipin

తమిళనాడు లోని నీలగిరి జిల్లాలో కూలిన MI -17 V5 హెలికాప్టర్‌లో ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్‌  ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) జనరల్‌ బిపిన్‌ రావత్‌ కూడా ఉన్నట్లు IAF ధృవీకరించింది. హెలికాప్టర్‌ కూలిన సమయంలో అందులో 9 మంది ప్యాసింజర్లు ఉన్నారు. రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక రావత్‌ కూడా ఉన్నారు. ఇంకా బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిద్దర్‌, లెఫ్టెనెంట్ కర్నల్‌ హర్జిందర్‌ సింగ్‌, ఎన్‌కే గురుసేవక్‌ సింగ్‌, జితేంద్ర కుమార్‌, వివేక్‌ కుమార్‌, సాయితేజ, హావ సత్పాల్‌ ఉన్నారు.

Passengers List

ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ముగ్గురు మరణించినట్టు గుర్తించారు. మిగిలిన వారికోసం గాలింపు జరుగుతోంది. ఆర్మీ అధికారులతో పాటు స్థానికులు కూడా గాలింపు జరుపుతున్నారు. మరోవైపు ప్రమదానికి గురైన హెలికాప్టర్ బూడిదైపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.