Punjab: భారత్ ను వీడే ప్రయత్నంలో అమృత్ పాల్ భార్యను అడ్డగించిన అధికారులు?

అమృత్ పాల్ సింగ్.. గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. పంజాబ్లో ఖలిస్థాన్ ఏర్పాటువాద

  • Written By:
  • Publish Date - April 20, 2023 / 07:00 PM IST

అమృత్ పాల్ సింగ్.. గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. పంజాబ్లో ఖలిస్థాన్ ఏర్పాటువాద నాయకుడు అయినా ఈ అమృత్ పాల్ సింగ్ పోలీసులకు చిక్కకుండా చెమటలు పట్టిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవలె అతడు వేషాలు మార్చుకొని పలు ప్రాంతాల్లో తిరిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే సీక్రెట్ గా దాక్కుంటూ అప్పటికప్పుడు తప్పించుకుంటూ పోలీసులకు చెమటలు పట్టిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అమృత్ పాల్ సింగ్ భార్య కిరణ్ దీప్ కౌర్ ను గురువారం ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఆమె అమృత సర్ ఏర్పోర్ట్ నుంచి లండన్ పారిపోయేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించేందుకు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఇప్పటికే అమృత పాల్ సింగ్ కు సంబంధించిన దగ్గర బంధువులు మిత్రులకు దేశం నుంచి విడిచి వెళ్లకుండా సర్క్యులర్ కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. అమృత్ పాల్ సింగ్ భార్య కిరణ్ దీప్ కౌర్ కు యూకే పౌరసత్వం ఉంది. ఆమెపై దేశంలో కానీ పంజాబ్లో కానీ ఎటువంటి కేసులు నమోదు కాలేదు. అంతేకాకుండా యూకే లో ఉన్నప్పుడు బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సభ్యురాలు అనే విషయానికి సంబంధించిన ఆధారాలు కూడా లేవు.

పంజాబ్ పోలీసులు కూడా ఎటువంటి ఎఫ్ఐఆర్ ను నమోదు చేయలేదు. కాగా గత నెల మార్చి 18న పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న అమృత్ పాల్ సింగ్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. వాహనాలు వేషాలను మారుస్తూ తప్పించుకొని తిరుగుతూనే ఉన్నాడు. అమృత్ సింగ్ పై మాత్రమే కాకుండా అతని అనుచరులపై కూడా పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు.