Site icon HashtagU Telugu

Maharastra : అమరావతిలో ఘోరప్రమాదం…భవనం కూలి ఐదుగురు కార్మికులు దుర్మరణం..!!

Mumbai (1)

Mumbai (1)

మహారాష్ట్రలోని అమరావతిలో ఘోర ప్రమాదం జరిగింది. పాత భవనం కూలడంతో 5గురు కూలీలు మరణించారు. ఇద్దర గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై డీఎం విచారణకు ఆదేశించారు. ప్రభాత్ చౌక్ లోని శిథిలావస్థకు చేరిన భవానికి మరమ్మత్తులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భవనం కుప్పకూలడంతో అందులో పనిచేస్తున్న ఐదుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకుని మరణించారు.

ప్రమాదం గురించి తెలుసుకున్న మున్సిపాలిటి స్క్వాడ్, రెస్య్కూ టీం ఘటనాస్థలానికి చేరుకున్నాయి. జేసీబీ సాయంతో సాహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఆసుపత్రికి తరలించే లోపు ఐదుగురు మరణించారు. ఘటనాస్థలానికి అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా చేరుకున్నారు. మ్రుతులకు సంతాపం ప్రకటించారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5 లక్షల సాయం ప్రకటించారు.