Site icon HashtagU Telugu

‘మ‌హా’ ప్ర‌భుత్వానికి ‘షా’ పోటు

Amit Shah Maharashtra

Amit Shah Maharashtra

రెండు రోజులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముంబాయి ప‌ర్య‌ట‌న స‌రికొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల‌కు దారితీసేలా క‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హారాష్ట్ర మాజీ సీఎం ఫ‌డ్న‌విస్‌, అమిత్ షా మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం జ‌రుగుతోంద‌ని భావిస్తున్న బీజేపీ క్యాడ‌ర్ కు ఈ టూర్ క్లారిటీ ఇచ్చింది. రాబోవు మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను మినీ విధాన‌స‌భ ఎన్నిక‌లుగా భావిస్తూ ఫ‌డ్న‌విస్ ఆధ్వ‌ర్యంలో ప‌నిచేయాల‌ని బీజేపీ శ్రేణుల‌కు షా పిలుపు నిచ్చారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్యా గ్యాప్ లేద‌నే సంకేతం పంపాడు.శివ‌సేన‌తో క‌లిసి అధికారాన్ని 50-50 ప‌ద్ద‌తిని పంచుకోవ‌డానికి బీజేపీ సిద్ధంగా లేద‌నే విష‌యాన్ని అమిత్ షా తేల్చి చెప్పేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ ఆ రెండు పార్టీలు క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంద‌ని జ‌రిగిన ప్ర‌చారానికి ఈ టూర్ తో ఫుల్ స్టాప్ ప‌డింది. శివసేన చీఫ్‌, సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే రాజీనామా చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని డిమాండ్ చేశాడు. దీంతో రాబోవు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ శివ‌సేన‌, బీజేపీ మ‌ధ్య పొత్తు ఉండే ఛాన్స్ లేద‌ని షా స్ప‌ష్టం చేశాడు. ఒంట‌రిగా బీజేపీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పోరాటం చేస్తుంద‌ని సంకేతాలు ఇచ్చాడు.2019 అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత తొలిసారిగా అమిత్ షా రాజ‌కీయ టూర్ ను మ‌హారాష్ట్ర‌లో నిర్వ‌హించాడు. రెండు రోజుల పాటు ఆయ‌న అక్క‌డ క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేశాడు. కాంగ్రెస్ పార్టీ స‌హ‌కార వ్య‌వ‌స్థ కోసం చేస్తోన్న డిమాండ్ల‌ను కూడా టార్గెట్ చేశాడు. ఎన్సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్ నియంత్ర‌ణ చేసే స‌హ‌కారం చ‌క్కెర ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తిపాద‌న‌ల‌పై షా త్రోసిబుచ్చాడు. షుగ‌ర్ ఫ్యాక్ట‌రీల‌కు బ్యాంకు గ్యారంటీల వివాదంపై బ‌ల‌మైన సంకేతం పంపాడు.రాష్ట్ర రాజకీయాలలో మరాఠా, OBC రిజర్వేషన్ అంశం ప్రధానాంశంగా ఉన్నాయి. వాటిని షా ఈ లేవనెత్తే అవ‌కాశం భ‌విష్య‌త్ లో లేక‌పోలేదు. రెండు రోజుల ఆయ‌న టూర్ కేవ‌లం మ‌హారాష్ట్ర రాబోవు ఎన్నిక‌ల పొలిటిక‌ల్ ట్రైల‌ర్ మాత్ర‌మే. ఫుల్ సినిమా చూప‌డానికి ఈసారి అమిత్ షా సిద్ధంగా ఉన్నారు. ఫ‌లితంగా మ‌హారాష్ట్ర‌లో పెద్ద‌ రాజకీయ సమరానికి రంగం సిద్ధమైంది.

Exit mobile version