జడ్ ప్లస్ భద్రతను తీసుకోవాలని ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరాడు. పార్లమెంట్లో అసరుద్దీన్ పై జరిగిన హత్యయత్నంపై షా వివరాలు ఇచ్చాడు. ఆ రోజున గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కార్కేడ్ వద్ద కాల్పులు జరిపారని వివరించాడు. వాహనానికి దిగువన మూడు బుల్లెట్లు దిగిన గుర్తులు ఉన్నాయని సాక్షులు చెప్పినట్టు తెలిపాడు. ఎఫ్ ఐఆర్ ను నమోదు చేసిన కేసు ను విచారిస్తున్నామని పార్లమెంట్లో వేసిన వేసిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. తన కదలికపై ఓవైసీ జిల్లా కంట్రోల్ రూమ్‌కు ఎలాంటి సమాచారం పంపలేదని షా తెలిపాడు. అసదుద్దీన్ ఒవైసీకి హాపూర్ జిల్లాలో ఎటువంటి ముందస్తు షెడ్యూల్ జరగలేదని, జిల్లా కంట్రోల్ రూమ్‌కు ఎటువంటి సమాచారం పంపకపోవడంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకోలేకపోయారని పేర్కొన్నాడు. సంఘటన తరువాత పోలీసుల సంరక్షణలో క్షేమంగా ఢిల్లీ చేరుకున్నారని రాజ్యసభలో అమిత్ షా వివరించాడు.
జెడ్ ప్లస్ భద్రతను తీసుకోవాలని అసదుద్దీన్ ఒవైసీని అమిత్ షా రాజ్యసభ సాక్షిగా కోరాడు. హత్యయత్నం జరిగిన రోజున ఓవైసీకి కేంద్రం జడ్ ప్లస్ ను ఆఫర్ చేసింది. కానీ, ఆయన తిరస్కరించిన విషయం విదితమే. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం మాత్రం చాలంటూ కేంద్రానికి ఓవైసీ తెలియచేశాడు. ఇప్పుడు షా మాట ప్రకారం జడ్ ప్లస్ తీసుకుంటారా? లేదా అనేది చూడాలి.
Owaisi Attack : జడ్ ప్లస్ ప్లీజ్
జడ్ ప్లస్ భద్రతను తీసుకోవాలని ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరాడు.

Owaisi Amit Shah
Last Updated: 07 Feb 2022, 03:26 PM IST