Amit Shah to Rahul Gandhi: రాహుల్ అమ్మమ్మ వచ్చినా CAA ఆగదు: అమిత్ షా

అమిత్ షా మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం (CAA) కు కాంగ్రెస్ వ్యతిరేకమని మరియు అధికారంలోకి వస్తే దానిని అంతం చేస్తామని రాహుల్ చేసిన చేసిన కామెంట్స్ పై ఫైర్ అయ్యారు. అలాగే రాహుల్ గాంధీ అమ్మమ్మ వచ్చినా CAAని తొలగించలేరని మండిపడ్డారు.

Published By: HashtagU Telugu Desk
Amit Shah to Rahul Gandhi

Amit Shah to Rahul Gandhi

Amit Shah to Rahul Gandhi: లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో పర్యటించారు. బుధవారం హర్దోయ్, లఖింపూర్, కన్నౌజ్‌లలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్న అమిత్ షా ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లఖింపూర్‌లో అమిత్ షా మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం (CAA) కు కాంగ్రెస్ వ్యతిరేకమని మరియు అధికారంలోకి వస్తే దానిని అంతం చేస్తామని రాహుల్ చేసిన కామెంట్స్ పై ఫైర్ అయ్యారు. అలాగే రాహుల్ గాంధీ అమ్మమ్మ వచ్చినా CAAని తొలగించలేరని మండిపడ్డారు.

హర్దోయ్ నుంచి బీజేపీ అభ్యర్థులు జై ప్రకాశ్, మిస్రిఖ్ నుంచి అశోక్ రావత్, కన్నౌజ్‌లో సుబ్రతా పాఠక్‌లకు మద్దతుగా ఆయన ఎన్నికల సమావేశాలు నిర్వహించారు. అయోధ్యలోని శ్రీరామ మందిరాన్ని ప్రస్తావిస్తూ ఎస్పీ, కాంగ్రెస్‌లు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయని షా అభివర్ణించారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ ఓటు బ్యాంకు కోసం గుడికి వెళ్లలేదని.. ఆ ఓటు బ్యాంకుకు భయపడి ఉండవచ్చని, అయితే బీజేపకి లేదని అన్నారు.లోక్‌సభలో ఆర్టికల్‌ 370ని రద్దుని ప్రకటిస్తున్నప్పుడు రాహుల్‌, అఖిలేష్‌లు నిరసన తెలిపి అక్కడ రక్తపాతం జరుగుతుందని చెప్పిన విషయాన్నీ గుర్తు చేశారు. ఐదేళ్లు గడిచినా ఎక్కడా ఒక్క గులకరాయి కూడా పడలేదని అన్నారు అమిత్ షా.

రామ్ లల్లా కార్యక్రమానికి ఎస్పీ అధినేత అఖిలేష్ ఓటు బ్యాంకుకు భయపడి అయోధ్యకు వెళ్లలేదని షా అన్నారు. ఎస్పీ-కాంగ్రెస్, బీఎస్పీ ఏళ్ల తరబడి మోసం చేశాయి. మోదీ కేవలం రెండేళ్లలో రామ మందిర నిర్మాణం పూర్తి చేశారని చెప్పారు.

Also Read: IPL 2024 : లక్నో ఫై ఓపెనర్ల ఊచకోత..SRH ఘనవిజయం

  Last Updated: 08 May 2024, 11:20 PM IST