BJP Plan B: మ్యాజికల్ ఫిగర్ రాకపోతే బీజేపీ ప్లాన్ B ?

బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బీ ఏమిటి ? ఈ ప్రశ్నకు అమిత్ షా స్పందిస్తూ ప్లాన్ ఎ విజయవంతమయ్యే అవకాశం 60 శాతం మాత్రమే ఉందని మీరు భావించే పరిస్థితిలో ప్లాన్ బి రూపొందించబడింది. కానీ మా పరిస్థితి అలా లేదు. ప్రధాని మోదీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

Published By: HashtagU Telugu Desk
BJP Plan B

BJP Plan B

BJP Plan B: 2024 లోక్‌సభ ఎన్నికలలో ఓటింగ్ ప్రక్రియ దశలవారీగా సాగుతోంది. ఈ క్రమంలో ఆయా రాజకీయ పార్టీల వాదనలు బలపడుతున్నాయి. అధికార పక్షం 400 దాటుతుందన్న లెక్కను పునరావృతం చేస్తుంటే.. నాలుగు దఫాలుగా తమ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని విపక్షాలు బలంగా చెప్తున్నాయి. అయితే ఈ వాదనలకు జూన్ 4న ఫుల్ స్టాప్ పడనుంది.

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికలలో బిజెపి స్థానం గురించి స్పష్టంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలపై సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా ఆయన బీజేపీ అధికారంలోకి రాకపోతే ప్లాన్ బి ఏంటన్న ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఈసారి ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ మ్యాజికల్ ఫిగర్ 272 సంఖ్యను దాటకపోతే ఏమి జరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అడిగినప్పుడు. అలాంటి అవకాశం నాకు కనిపించడం లేదు. 60 కోట్ల మంది లబ్ధిదారుల సైన్యం ప్రధాని మోడీతో నిలబడి ఉంది. వారికి కులం లేదా వయస్సుతో సంబంధం లేదు..బీజేపీ అమలు చేసిన ప్రయోజనాలన్నీ పొందిన వారికి నరేంద్ర మోడీ అంటే ఏమిటో తెలుసు. అందుకే బీజేపీ 400 సీట్లను ఖాయం చేసుకోనుందని అమిత్ షా తెలిపారు.

బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బీ ఏమిటి ? ఈ ప్రశ్నకు అమిత్ షా స్పందిస్తూ ప్లాన్ ఎ విజయవంతమయ్యే అవకాశం 60 శాతం మాత్రమే ఉందని మీరు భావించే పరిస్థితిలో ప్లాన్ బి రూపొందించబడింది. కానీ మా పరిస్థితి అలా లేదు. ప్రధాని మోదీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

Also Read: Indoor Plants: ఇంట్లో ఉండే మొక్కలు వ‌ల‌న అల‌ర్జీ, ఆస్త‌మా వ‌స్తాయా..?

  Last Updated: 17 May 2024, 03:24 PM IST