Modi 3.0 Cabinet: హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా

ఈ రోజు మంగళవారం హోంశాఖ మంత్రిగా అమిత్ షా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన కార్యాలయంలో మోడీ 3.0 ప్రభుత్వంలో ఆయన మూడవసారి మంత్రిగా పదవి బాధ్యతలు అందుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చేరుకున్నారు. ఇక్కడ ఆయన వరుసగా రెండోసారి విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు

Modi 3.0 Cabinet: కొత్త క్యాబినెట్ మంత్రులు ఎన్‌డిఎ ప్రభుత్వంలో తమ తమ పదవులను చేపట్టడం ప్రారంభించారు. ఈసారి 30 మంది కేబినెట్‌ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని ఆదేశాలు అందిన వెంటనే అందరూ ఒక్కొక్కరుగా కార్యాలయానికి చేరుకుని బాధ్యతలు స్వీకరిస్తున్నారు. జూన్ 9న నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో చాలా మందికి మళ్లీ అదే మంత్రిపదవి లభించింది. అమిత్ షాకు హోం శాఖ, జైశంకర్‌కు విదేశాంగ శాఖ, రాజ్‌నాథ్‌సింగ్‌కు రక్షణ శాఖను అప్పగించారు.

ఈ రోజు మంగళవారం హోంశాఖ మంత్రిగా అమిత్ షా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన కార్యాలయంలో మోడీ 3.0 ప్రభుత్వంలో ఆయన మూడవసారి మంత్రిగా పదవి బాధ్యతలు అందుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చేరుకున్నారు. ఇక్కడ ఆయన వరుసగా రెండోసారి విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. దేశానికి మళ్లీ సేవ చేయాలని ప్రధాని మోదీని ప్రజలు ఆశీర్వదించారని అన్నారు. గత 10 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ రైల్వేలో అనేక సంస్కరణలు చేశారు. రైల్వేల విద్యుదీకరణ, కొత్త ట్రాక్‌ల నిర్మాణం, కొత్త రకాల రైళ్లు, కొత్త సర్వీసులు లేదా స్టేషన్‌ల పునరాభివృద్ధి వంటివి గత 10 ఏళ్లలో ప్రధాని మోదీ సాధించిన ప్రధాన విజయాలపై ఆయన మాట్లాడారు.

కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్ పదవి బాధ్యతలు అందుకున్నారు.ఈ బాధ్యతను నెరవేర్చడానికి నేను పూర్తి సంసిద్ధతతో పని చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ ఈరోజు తన మంత్రిత్వ శాఖగా బాధ్యతలు స్వీకరించారు. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా సురేష్ గోపి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు జ్యోతిరాదిత్య సింధియా. 140 కోట్ల మంది భారతదేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానని చెప్పారు. ఢిల్లీలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా జగత్ ప్రకాష్ నడ్డా బాధ్యతలు స్వీకరించారు. అనుప్రియా పటేల్‌, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి జాదవ్‌ ప్రతాప్‌రావు గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Also Read: WhatsApp: వాట్సాప్‌ కాల్స్‌ను రికార్డ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ సూపర్ ట్రిక్ మీకోసమే?