Amit Shah : కేజ్రీవాల్‌ వి కోర్టుధిక్కరణ వ్యాఖ్యలు..అమిత్‌ షా

Amit Shah: ఇటివల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌(Delhi CM Arvind Kejriwal) మాట్లాడుతూ.. ఇండియా కూటామి అధికారంలోకి వస్తే..తాను మళ్లీ జైలుకు వెళాల్సిన అవసరం ఉండదు అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర హూం మంత్రి అమిత్‌ షా(Union Home Minister Amit Shah) స్పందిస్తూ.. ఇంతకు మించి కోర్టు ధిక్కరణ(Contempt of court) ఉండదని అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వాలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పులిస్తుందనే కేజ్రీవాల్ ఉద్దేశమని […]

Published By: HashtagU Telugu Desk
Amit Shah responded to Kejriwal's comments

Amit Shah responded to Kejriwal's comments

Amit Shah: ఇటివల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌(Delhi CM Arvind Kejriwal) మాట్లాడుతూ.. ఇండియా కూటామి అధికారంలోకి వస్తే..తాను మళ్లీ జైలుకు వెళాల్సిన అవసరం ఉండదు అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర హూం మంత్రి అమిత్‌ షా(Union Home Minister Amit Shah) స్పందిస్తూ.. ఇంతకు మించి కోర్టు ధిక్కరణ(Contempt of court) ఉండదని అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వాలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పులిస్తుందనే కేజ్రీవాల్ ఉద్దేశమని ఆరోపించారు అమిత్ షా.

We’re now on WhatsApp. Click to Join.

బీజేపీకి ఎలాంటి ప్లాన్​ బీ లేదని, అద్భుతమైన మెజారిటీతో మోడీ ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల వేళ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ 400 కంటే ఎక్కువ లోక్‌ సభ స్థానాలను గెలవాలనుకుంటుందని ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. గత పదేళ్లుగా తమకు పార్లమెంట్​లో పూర్తి మెజారిటీ ఉందని, కానీ ఎప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలనుకోలేదని తెలిపారు. దేశ రాజకీయాల్లో సుస్థిరతను తీసుకువచ్చేందుకు ఎన్​డీఏ 400కంటే ఎక్కువ సీట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు.

Read Also: Satyadev Krishnamma : వారంలోనే OTT రిలీజ్.. సత్యదేవ్ కృష్ణమ్మ మరీ ఇంత ఘోరమా..!

కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టయి 20 రోజులు జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌ ఇవ్వడంతో అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రత్యేక వ్యూహం రచించారు. మే 25న ఆరో దశలో పోలింగ్‌ జరగనుంది. అనంతరం జూన్‌ 2వ తేదీన అరవింద్‌ కేజ్రీవాల్‌ తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది.

  Last Updated: 17 May 2024, 02:09 PM IST