Site icon HashtagU Telugu

Amit Shah: మహిళ బిల్లు ఆమోదంతో మహిళల సుదీర్ఘ పోరాటానికి తెరపడింది

Amit Shah

Amit Shah

Amit Shah: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మూడో రోజు మహిళా రిజర్వేషన్ బిల్లుపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు.

గణేష్ చతుర్థి నాడు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును సభలో ప్రవేశపెట్టామని అమిత్ షా అన్నారు. ఇది భారత పార్లమెంటు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని అన్నారు. కొత్త ఆర్టికల్స్ 303, 30ఎ లోక్‌సభలో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పిస్తాయని అలాగే 332ఎ అసెంబ్లీలలో మూడింట ఒక వంతు రిజర్వేషన్ కల్పిస్తుందని అమిత్ షా అన్నారు. దీనితో పాటు SC/ST కేటగిరీకి రిజర్వ్ చేయబడిన అన్ని సీట్లలో, మూడవ వంతు సీట్లు కూడా మహిళలకు దక్కుతాయని షా చెప్పారు. ఈ బిల్లు ఆమోదంతో మహిళల సుదీర్ఘ పోరాటానికి తెరపడుతుందని హోంమంత్రి అన్నారు.

గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ వడోదర కార్యవర్గం జరిగిందని, ఆ చారిత్రాత్మక కార్యవర్గంలో మోదీజీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత పదవుల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ కల్పించారని షా అన్నారు. .అలా చేసిన మొదటి, చివరి పార్టీ బీజేపీ అని గర్వంగా చెప్పగలను అని అన్నారు.

Also Read: TDP Leader : కాకినాడ టీడీపీ దీక్షాశిబిరంలో మహిళా నేత మృతి