Amit Shah: 400 ఫిగర్ ప్పై అమిత్ షా క్లారిటీ ఇదే..

2024 లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు ​​అనే నినాదాన్ని ప్రధాని మోదీ ఎందుకు ఇచ్చారో వివరించారు అమిత్ షా. శుక్రవారం రాజస్థాన్‌లోని పాలి నగరంలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ..ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా రిజర్వేషన్లకు ప్రధాని మోదీయే ఎక్కువ మద్దతు ఇస్తున్నారని నేను వారికి చెప్పాలనుకుంటున్నానని అమిత్ షా అన్నారు.

Amit Shah: 2024 లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు ​​అనే నినాదాన్ని ప్రధాని మోదీ ఎందుకు ఇచ్చారో వివరించారు అమిత్ షా. శుక్రవారం రాజస్థాన్‌లోని పాలి నగరంలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ..ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా రిజర్వేషన్లకు ప్రధాని మోదీయే ఎక్కువ మద్దతు ఇస్తున్నారని నేను వారికి చెప్పాలనుకుంటున్నానని అమిత్ షా అన్నారు.

ఆర్టికల్ 370ని తొలగించి భారత ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకొచ్చామని అమిత్ షా అన్నారు. సైనిక సిబ్బందికి వన్ ర్యాంక్ వన్ పెన్షన్ తీసుకొచ్చాము, ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశాము. అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్లు, CAAని అమలు చేశాము, అలాగే అయోధ్యలో రామ మందిరం నిర్మించాము. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నాం. మోదీని మూడోసారి ప్రధానిని చేయడానికి ఈ అంశాలు సరిపోవా అని ప్రశ్నించారు షా. దేశానికి ఇలాంటి ప్రధాని అక్కర్లేదని రాహుల్ గాంధీ కామెంట్స్ పై అమిత్ షా మాట్లడుతూ.. 3 నెలల పాటు సెలవు పెట్టి విదేశాలకు వెళ్లే యువరాజు రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాలా లేదా సరిహద్దులకు వెళ్లి సైనికులతో మిఠాయిలు తింటున్న ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి అవసరమా అన్నార. ఒకవైపు తీవ్రవాదాన్ని, నక్సలిజాన్ని తారాస్థాయికి తీసుకెళ్లిన కాంగ్రెస్ పార్టీ మరో వైపు ఉగ్రవాదాన్ని పదేళ్లలో అంతం చేస్తానన్న నరేంద్ర మోదీ కావాలా అని ప్ప్రశ్నించారు.

We’re now on WhatsAppClick to Join

దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, అయితే రామ్‌లాల్‌ను ఏళ్ల తరబడి డేరాలో ఉంచారని, రామజన్మభూమి కేసును పెండింగ్‌లో ఉంచారని అమిత్ షా అన్నారు. మోడీ రెండో పర్యాయాల్లోన్నే అయోధ్యలో భూమి పూజ చేసి రాంలాల్ జీవితం కూడా పవిత్రమైంది. ప్రాణ్-ప్రతిష్ఠా మహోత్సవ్‌కు కాంగ్రెస్‌ను ఆహ్వానించినప్పుడు హాజరు కాలేదని ఎందుకంటే మైనారిటీ ఓటు బ్యాంకు చూసి భయపడుతున్నారని అమిత్ షా అన్నారు. రామమందిరం, కాశీ విశ్వనాథ్ కారిడార్, మహాకాల్ కారిడార్ మాత్రమే పూర్తి చేశాం. సోమనాథ్ ఆలయ పనులు కూడా కొనసాగుతున్నాయి. కాళీమాత శక్తిపీఠం నిర్మితమవుతుందని షా చెప్పారు. మోడీని మూడోసారి పీఎం చేయడానికి ఇవి సరిపోవా ఆంటూ కాంగ్రెస్ ను ప్రశ్నించారు అమిత్ షా.

Also Read; Polling Station: ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసా.. ఓటు వేయాలంటే కష్టమే