Amit Shah : హెలికాఫ్టర్ ప్రమాదం నుండి బయటపడ్డ అమిత్ షా..!!

గత వారం కూడా అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ప్రతికూల వాతావరణం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి

Published By: HashtagU Telugu Desk
Amithsha Escapes Major Acci

Amithsha Escapes Major Acci

బిజెపి అగ్ర నేత, కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah)..పెనుప్రమాదం (Accident) నుండి క్షేమంగా బయటపడ్డారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం నడుస్తుంది. ఈ క్రమంలో రాజకీయ పార్టీల నేతలంతా తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అన్ని నియోజకవర్గాలను కవర్ చేసే నేపథ్యంలో నేతలు హెలికాప్టర్‌(Helicopter)లో ప్రయాణం చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో అమిత్ షా సోమవారం బిహార్‌లో పర్యటించారు. బెగుసరాయ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. సభ పూర్తి అయిన తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. గాల్లోకి కొద్దిగా ఎగిరిన హెలికాప్టర్.. బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో కొద్దిసేపు అక్కడే చక్కర్లు కొట్టింది. ఏంజరుగుతుందో అని అంత ఖంగారుపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

అనంతరం చాకచక్యంగా వ్యవహరించిన పైలట్.. హెలికాప్టర్‌ను సురక్షితంగా గాల్లోకి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. గత వారం కూడా అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ప్రతికూల వాతావరణం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ కారణంగా కిందకు దిగలేకపోయింది. దీంతో ఆ పర్యటనను అమిత్​ షా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇలా వారంలో రెండుసార్లు ఇలా జరగడం తో బిజెపి శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పలువురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన దాఖలాలు కూడా ఉన్నాయి. అందుకే రాజకీయ నేతలు హెలికాప్టర్ ప్రయాణం అంటే కాస్త ఖంగారుపడుతుంటారు.

Read Also :  Kejriwal : బెయిల్‌ కోసం ట్రయల్ కోర్టులో ఎందుకు పిటిషన్‌ చేయలేదు?: కేజ్రీవాల్‌కి సుప్రీం ప్రశ్న

  Last Updated: 29 Apr 2024, 06:58 PM IST