Site icon HashtagU Telugu

Gujarat: రంగంలోకి ట్రబుల్ షూటర్.. గుజరాత్ ఎన్నికలపై ఫోకస్..!!

Hm Amit Shah

Hm Amit Shah

గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో గుజరాత్ లో గెలుపే లక్ష్యంగా రంగంలోకి దిగారు కేంద్రహోంశాఖమంత్రి అమిత్ షా. ఈ ఎన్నికలను సీఈసీ రెండు విడతలుగా చేపట్టనుంది. నవంబర్ 6న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ప్రటించిన తర్వాత ప్రచారం షురూ చేయనున్నారు. కాగా మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. 2017లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండగా…ఈసారి అందులోకి ఆమ్ ఆద్మీకూడా వచ్చి చేరింది. దీంతో గుజరాత్ రాబోయే ఎన్నికలు త్రిముఖ పోటీ అన్నట్లు ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఈ ఎన్నికల్లో ఎవరి ఓటు బ్యాంకు చీలుతుందో వేచిచూడాల్సిందే. కాగా గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా…27ఏళ్ల నుంచి బీజేపీనే అధికారంలో కొనసాగుతూ వస్తోంది. గుజరాత్ అంటనే మోదీ…మోదీ అంటేనే గుజరాత్ అనే విధంగా తన పట్టు సాధిస్తున్నారు. కాగా ఆమ్ ఆద్మీపార్టీ తరపును సీఎం అభ్యర్థిని ప్రకటించారు అరవింద్ కేజ్రివాల్.

ఇక ఈసారి గుజరాత్ లో బీజేపీకి అధికారం కట్టబెట్టే బాధ్యతను అమిత్ షా తన భుజాలపై వేసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. గతనెలలో 16రోజులు గుజరాత్ లోనే గడిపారు అమిత్ షా. 45 బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు.