Amit Shah ‘Deepfake’ Video Case: ముగ్గురి కాంగ్రెస్ నేతల అరెస్ట్

కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ సతీష్‌తోపాటు నవీన్, తస్లీమాను అరెస్ట్ చేసారు. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - May 2, 2024 / 01:57 PM IST

బిజెపి అగ్ర నేత, కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) డీప్ ఫేక్ వీడియో కేసు(‘Deepfake’ Video Case) లో హైదరాబాద్ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ సతీష్‌తోపాటు నవీన్, తస్లీమాను అరెస్ట్ చేసారు. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ నేత (BJP Leader) ప్రేమేందర్ (Premender) ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber crime police) కేసు నమోదు చేశారు.

ఢిల్లీ పోలీసుల నోటీసుల కంటే ముందే హైదరాబాదులో కేసు నమోదైంది. కొద్దీ సేపటి క్రితం (గురువారం) ముగ్గురిని అరెస్ట్ చేసి హైదరాబాద్ సీపీఎస్‌కు తరలించారు. రిజర్వేషన్లపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలను వక్రీకరించారన్న వివాదం నేపథ్యంలో ‘డీప్‌ఫేక్‌’ వీడియోలపై ఢిల్లీ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నందున డీప్‌ఫేక్‌ వీడియోల వ్యాప్తిని, ప్రసారాన్ని అరికట్టేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని న్యాయవాదుల బృందం ఈ పిల్‌లో కోరింది.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు అమిత్‌షా వీడియో మార్ఫింగ్ కేసు విచారణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. టీపీసీసీ సోషల్ మీడియాకు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పలువురిని విచారిస్తారంటూ వార్తలు సైతం విన్పిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. తాజాగా మరోసారి రాష్ట్రానికి రావడం ఆసక్తికరంగా మారింది. అలాగే ఢిల్లీ పోలీసులు జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ ఠాకూర్‌కు సమన్లు పంపారు. గురువారం విచారణకు హాజరుకావాలని అందులో ప్రస్తావించారు. ఢిల్లీ పోలీసులు తనకు నోటీసు ఎందుకు ఇచ్చారో అర్థంకావడం లేదన్నారు. ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరిన తరుణంలో ఇక్కడ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో భాగంగా సీఎం రేవంత్‌కు సమన్లు జారీ చేయడం ఫై ఆయన స్పందించారు.‘‘బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రినైనా నాకు, గాంధీ భవన్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారు’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Read Also : Etela : ప్రధాని మోడీ బ్రతికితే ప్రజల కోసమే..చనిపోతే ప్రజల కోసమేః ఈటెల