Site icon HashtagU Telugu

Amit Shah : రామమందిరం దర్శనానికి జనవరి 2024 నుంచి టికెట్ బుక్ చేసుకోండి..!!

Ayodhya

Ayodhya

గుజరాత్ ఎన్నికల వేళ కేంద్రహోంమంత్రి అమిత్ షా ఓ జాతీయ న్యూస్ ఛానెల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇందులో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. ఈ సందర్భంగా రామమందిరం నిర్మాణం పూర్తయ్యే తేదీని కూడా వెల్లడించారు. 2024 జనవరి నాటికి రామమందిరం దర్శనానికి టికెట్ చేసుకోండి అంటూ అమిత్ షా అన్నారు. మేము హామీ ఇచ్చిన భూమిలోనే రామ మందిరాన్ని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు.

ఆర్టికల్ 370ను రద్దు చేస్తామని 1950నుంచి చెబుకొస్తున్నామని గుర్తు చేశారు. అన్నట్లుగా ప్రధానిమంత్రి మోదీ ఈ పనిచేసి చూపించారన్నారు. శ్రీరాముడు జన్మించిన భూమిలోనే రామమందిరం నిర్మించాలని చెప్పాం. కానీ కాంగ్రెస్ మమ్మల్ని వ్యతిరేకించింది. మాపై తప్పుడు ఆరోపణలు చేసింది. రామమందిరం కట్టిస్తామని తేదీ చెప్పండి అంటూ ఎగతాళి చేశారు. ఇప్పుడు చెబుతున్నాం…జనవరి 2024 నాటికి రామమందిరం పూర్తవుతుందని చెప్పారు.

ట్రిపుల్ తలాక్ కు చెక్ పెట్టాలనుకుంటున్నట్లు షా తెలిపారు. 206నాటికి భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుకుంటుందని పలు ఏజెన్సీలు వెల్లడించినట్లు తెలిపారు. భారతదేశాన్ని సురక్షితంగా ఉంచుతామని దేశప్రజలకు హామీ ఇచ్చామని…ఆ హామీ ప్రకారమే దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్నట్లు చెప్పారు. అంతర్గత భద్రతను పటిష్టం చేశామన్నారు.

Exit mobile version