Electoral Bonds Data : ఎలక్టోరల్ బాండ్స్‌ ఫై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ఎలక్టోరల్ బాండ్స్‌తో తమకు ఎన్ని విరాళాలు వచ్చాయో ప్రతిపక్ష పార్టీల కూటమికి అన్ని విరాళాలు వచ్చాయని అమిత్ షా అన్నారు

  • Written By:
  • Publish Date - March 20, 2024 / 01:26 PM IST

కేంద్ర మంత్రి అమిత్ షా (Amith Sha) ఎలక్టోరల్ బాండ్ల (Electoral Bond Data) ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్ల (Electoral Bond Data) గురించే చర్చ నడుస్తుంది. ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బయటపెట్టాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలు జారీ చేయడం తో ఆ వివరాల జాబితాలను ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. బిజెపి పార్టీ కే వేలాది కోట్లు విరాళాలుగా ఇచ్చినట్లు నివేదికలో బయటపడుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో అమిత్ షా..ఎలక్టోరల్ బాండ్ల ఫై పలు వ్యాఖ్యలు చేసారు. ఎలక్టోరల్ బాండ్స్‌తో తమకు ఎన్ని విరాళాలు వచ్చాయో ప్రతిపక్ష పార్టీల కూటమికి అన్ని విరాళాలు వచ్చాయని అమిత్ షా అన్నారు. ఎలక్టోరల్ బాండ్ ఇష్యూకు సంబంధించి, భారత సుప్రీంకోర్టు నిర్ణయాలను అమిత్ షా అంగీకరించారు. అయితే, కోర్టు తీర్పుతో ఎన్నికల నిధుల్లోకి నల్లధనం వెనక్కి వచ్చే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్ల వినియోగం ఎన్నికల నిధుల్లో చేరి ఉన్న నల్లధనాన్ని తగ్గించడంలో దోహదపడిందని అభిప్రాయపడ్డారు.

Read Also : IPL 2024: ఐపీఎల్ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. మ్యాచ్‌ల‌ను ఫ్రీగా ఎక్క‌డ చూడొచ్చంటే..?