గత మూడు నెలలుగా మణిపూర్ (Manipur) వణికిపోతోంది. కుకీలు, మెయిటీలకు మధ్య భయంకర పోరు నడుస్తుంది. నడి రోడ్ ఫై ఇద్దరు మహిళలను వివస్త్రల్ని చేసి రోడ్డుపై నడిపించుకుంటూ వెళ్లి గ్యాంగ్ రేప్ చేసి హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇలాంటి ఘటనలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తూ సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళల గ్యాంగ్ రేప్ (Gang Rap) ఘటన ఫై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఇదే తరుణంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వరుసగా వాయిదాలు పడుతూ వస్తున్నాయి. సుప్రీంకోర్టు సైతం మణిపూర్ ఘటన లపై తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసుకుని విచారణకు ఆదేశించింది. బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది.
కాగా ఈ ఘటన కు సంబంధించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే మహిళల నగ్న ఊరేగింపు వీడియోను విడుదల చేశారని.. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ఓ మైనర్ సహా ఆరుగురిని అరెస్ట్ చేసారని , వీడియో తీసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని.. వీడియో తీసిన మొబైల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే ఈ వీడియో విడుదల చేశారని.. దీని వెనక కుట్ర ఉందని అమిత్ షా ఆరోపించారు.
1990 నుంచి మణిపూర్‌లో కుకీ, మెయితీ తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని ..కేంద్రంలో, మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. చాలా ఘటనలు జరిగాయని అమిత్ షా గుర్తుచేశారు. 1993 లో నాగా – కుకీలకు.. 1993 మే నెలలో మెయితీ – పంగల్ తెగల మధ్య, 1995 లో కుకీలు – తమిళుల మధ్య, 1997 నుంచి 1998 మధ్య కుకీ – మెయితీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. మణిపూర్ అల్లర్లకు సంబంధించిన కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది. ఇప్పటికే 6 కేసులను ఇప్పటికే సీబీఐకి పంపినట్లు వెల్లడించారు. మరో 3 కేసులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతోందని హామీ ఇస్తున్నామని తెలిపారు.
Read Also : WhatsApp: వాట్సప్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై షార్ట్ వీడియో మెసేజెస్?