Amit Shah: దేశ భద్రతపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం

దేశ భద్రతపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఉన్న హోం మంత్రిత్వ శాఖలో ప్రస్తుతం ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది.

Amit Shah: దేశ భద్రతపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఉన్న హోం మంత్రిత్వ శాఖలో ప్రస్తుతం ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలు, అమర్‌నాథ్ యాత్రకు ఏర్పాట్లను సమీక్షించే లక్ష్యంతో ఈ సమావేశం జరుగుతోంది.

ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి ప్రాంతంలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై అమిత్ షా కీలక విషయాలపై చర్చించనున్నారు. ఈ ఉగ్రదాడిలో 10 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ దేకా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ సహా సీనియర్ సైనికాధికారులు పాల్గొన్నారు.

జమ్మూకశ్మీర్‌లో గత కొద్ది రోజులుగా ఉగ్రదాడులు ఎక్కువయ్యాయి. 4 రోజుల్లో లోయలో ఉగ్రవాదులు 4 దాడులు చేశారు. రియాసి, కథువా, దోడా ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. దీంతో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగుతున్నట్లు స్పష్టమవుతోంది. అయితే భద్రతా బలగాలు కూడా ఉగ్రవాదులకు ధీటుగా సమాధానమిస్తున్నాయి. తాజాగా కతువాలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. జమ్మూకశ్మీర్‌లోని ప్రతి మూల నుంచి ఉగ్రవాదులను అంతమొందించేందుకు భద్రతా బలగాలు నిమగ్నమై ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదులను అంతమొందించేందుకు అమిత్ షా భేటీలో పక్కా ప్రణాళిక రూపొందించవచ్చు. అదే సమయంలో, అమిత్ షా ఎజెండాలో అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

జూన్ 9న జమ్మూకశ్మీర్‌లోని రియాసి ప్రాంతంలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడం గమనార్హం. సాయంత్రం 6:15 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు జరపడంతో బస్సు అదుపు తప్పి లోతైన గోతిలో పడిపోయింది. బస్సుపై దాడి చేసిన ఉగ్రవాదులు కొండ ప్రాంతంలో తలదాచుకున్నారు. ఈ దాడిలో 10 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు.

Also Read: T20 World Cup: శభాష్ స్కాట్లాండ్ ఆసీస్ ,ఇంగ్లాండ్ లను టెన్షన్ పెట్టిన టీమ్