Site icon HashtagU Telugu

Amit Shah: నాగాలాండ్ ఘటనపై అమిత్ షా రియాక్షన్!

నాగాలాండ్ లోని మోన్ జిల్లాలో సైనికులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులుగా పొరబడి భారత సైనికులు కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో సామాన్య పౌరులతో కలిపి మొత్తం 15 మంది మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఒక్క పొరపాటు వల్లే 15 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిదంటూ పలువురు అభిప్రాయపడ్డారు. అయితే సైనికులపై ఒకింత వ్యతిరేకత మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైనిక చర్యపై స్పందించారు.

ఓటింగ్‌, మోన్‌ ప్రాంతాల్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు ఆర్మీకి సమాచారం అందిందని, డిసెంబరు 4వ తేదీన ఆ ప్రాంతాల్లో ఆర్మీ 21 పారా కమాండో యూనిట్‌ మెరుపు దాడి చేపట్టిందని ఆయన వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో ఓ వాహనం అటుగా వస్తుండగా భద్రతా బలగాలు ఆపమని చెప్పాయి, అయితే వారు ఆగకుండా అక్కడి నుంచి వేగంగా పారిపోయే ప్రయత్నం చేశారని స్పష్టం చేశారు.  అందులో ఉన్నది ఉగ్రవాదులు అని అనుమానించిన దళాలు.. ఆ వాహనంపై కాల్పులు జరిపారని ఆయన అమిత్ షా అన్నారు. ఆ తర్వాత పొరబాటు జరిగిందని గుర్తించిన బలగాలు.. వాహనంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాయని, కాల్పుల విషయం తెలియగానే స్థానిక గ్రామాల ప్రజలు ఆర్మీ యూనిట్‌ను చుట్టుముట్టి దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో ఆత్మ రక్షణ కోసం సైనిక బలగాలు మళ్లీ కాల్పులు జరపాల్సి వచ్చిందని, ఈ కాల్పుల్లో మరో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారని, పౌరుల దాడిలో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరించారు.

Exit mobile version