PoK – INDIA : పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) భారత్‌లో భాగమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. భారత్‌లో భాగంగా పరిగణిస్తున్నందునే.. పీఓకేకు కూడా 24 స్థానాలను రిజర్వ్ చేశామని లోక్‌సభకు తెలిపారు. 70ఏళ్ల నుంచి హక్కులు కోల్పోయినవారికి న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌కు సంబంధించి రెండు బిల్లులు తెచ్చిందన్నారు. కశ్మీర్‌లో రెండు స్థానాలను కశ్మీర్ నుంచి వలస వెళ్లినవాళ్లు, ఒక స్థానాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) నుంచి వచ్చి స్థిరపడినవారికి రిజర్వ్ చేసినట్లు అమిత్ షా వెల్లడించారు. తొలిసారిగా ఎస్సీ/ఎస్టీ కమ్యూనిటీలకు 9 స్థానాలు కేటాయించామన్నారు. నిర్వాసితులైనవారు ఈ రిజర్వేషన్ల ద్వారా చట్టసభలో తమ వాణిని వినిపించేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు, జమ్ముకశ్మీర్ పునర్విభజన సవరణ బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లులపై జరిగిన చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఓటుబ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకోకుండా ఆరంభంలోనే ఉగ్రవాదాన్ని అణిచివేసి ఉంటే పండిట్లు కశ్మీర్ లోయను వీడాల్సి వచ్చేది కాదని అమిత్‌షా అన్నారు. ఉగ్రవాదం కారణంగా కశ్మీర్‌లోయను వీడినవారికి శాసనసభలో ప్రాతినిధ్యం కల్పించేందుకు వీలుగా ఒక బిల్లు తెచ్చామన్నారు. వెనుకబడిన తరగతులను వ్యతిరేకించటమే కాకుండా వారి అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆయన(PoK – INDIA) దుయ్యబట్టారు.