Modi 3.0 Cabinet : మూడోసారి మోడీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న అమిత్ షా, జేపీ నడ్డా

రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా తదితరులకు మూడోసారి మోడీ కేంద్ర వర్గంలో చోటు దక్కింది

  • Written By:
  • Updated On - June 10, 2024 / 12:10 AM IST

సార్వత్రిక ఎన్నికల్లో NDA కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఢిల్లీ లోని రాజ్​భవన్​ వద్ద ప్రధాని మోడీ తో పాటు కేంద్ర మంత్రులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొత్తం ఏడు దేశాల అధినేతలు హాజరయ్యారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, సీషెల్స్‌ ఉపాధ్యక్షుడు అహ్మద్‌ అఫీఫ్‌, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు, భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ టోబ్గే , నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహాల్, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, మారిషస్‌ ప్రధాని ప్రవిండ్‌ కుమార్‌ జగన్నాథ్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

ముందుగా భారతదేశ ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ చేయించారు. 2014లో మోదీ తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. 2019లోనూ విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. 2024 ఎన్నికల్లోనూ ఎన్డీయేకు 293 స్థానాలు దక్కడంతో మళ్లీ ప్రధానిగా పగ్గాలు చేపట్టే అవకాశం లభించింది. ఆ తర్వాత కేంద్ర మంత్రులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కేంద్రమంత్రులుగా రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా , నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా , మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌, ఎస్‌.జైశంకర్‌ , మనోహర్‌లాల్ ఖట్టర్‌ , హెచ్‌డీ కుమారస్వామి , పీయూశ్ గోయల్‌ , ధర్మేంద్ర ప్రదాన్‌ , జితన్‌రామ్‌ మాంఝీ లు ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేసారు. రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా తదితరులకు మూడోసారి మోడీ కేంద్ర వర్గంలో చోటు దక్కింది.

Read Also : Rasam Powder : చారుపొడి రెసిపీ.. 6 నెలలకు సరిపడా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి