Site icon HashtagU Telugu

Anand Mahindra: అగ్ని వీరులకు ఆనంద్ మహీంద్రా ఆఫర్

Anand Mahindra

Anand Mahindra

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం నిరసనల మధ్య ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆఫర్ ఇచ్చారు. కార్పొరేట్ సెక్టార్‌లో అగ్నివీరుల ఉపాధికి అవకాశం ఉందని మహీంద్రా చెప్పారు. అగ్నిపథ్ పథకం కింద శిక్షణ పొందిన వ్యక్తులను రిక్రూట్ చేసుకునే అవకాశాన్ని కార్పొరేట్ సెక్టార్ కోరుకుంటుందని కూడా మహీంద్రా పేర్కొన్నారు.‘‘కేంద్రం యొక్క కొత్త సైనిక నియామక పథకం ‘అగ్నిపథ్’పై హింసాకాండ, నిరసనలపై తాను చింతిస్తున్నానని ఆనంద్ మహీంద్రా తెలిపారు. అగ్నివీరుల క్రమశిక్షణ, నైపుణ్యాలు వారికి మంచి ఉపాధి కల్పిస్తాయని ఆయన నొక్కి చెప్పారు. అగ్నిపథ్ కార్యక్రమంపై జరిగిన హింసాకాండ పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.

అగ్నిపథ్ శిక్షణ పొందిన సమర్థులైన యువకులను రిక్రూట్ చేసుకునే అవకాశాన్ని మహీంద్రా గ్రూప్ స్వాగతిస్తోందని సోమవారం మహీంద్రా ట్వీట్ చేశారు. మహీంద్రా అగ్నివీరులను ఏ స్థానాల్లో నియమిస్తుందని అడిగినప్పుడు పారిశ్రామికవేత్త స్పందించారు.‘‘కార్పొరేట్ రంగంలో అగ్నివీరులకు ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంది. నాయకత్వం, జట్టుకృషి శారీరక శిక్షణతో అగ్నివీర్లు కార్పొరేట్ రంగానికి ఉత్తమ సేవలు అందిస్తారు’’ అని మహీంద్రా చెప్పారు.