Opposition Meet: రాహుల్ నాయకత్వానికి ఆప్ నో…!

ప్రతిపక్షాల ఐక్యతపై ఆమ్ ఆద్మీ పార్టీ తన వైఖరిని స్పష్టం చేసింది. ఢిల్లీ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ పార్లమెంటులో వ్యతిరేకించకపోతే, ఆప్ కాంగ్రెస్ నేతృత్వంలో పని చేయబోమని స్పష్టం చేసింది.

Opposition Meet:ప్రతిపక్షాల ఐక్యతపై ఆమ్ ఆద్మీ పార్టీ తన వైఖరిని స్పష్టం చేసింది. ఢిల్లీ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ పార్లమెంటులో వ్యతిరేకించకపోతే, ఆప్ కాంగ్రెస్ నేతృత్వంలో పని చేయబోమని స్పష్టం చేసింది. కాగా ఇప్పుడు కాంగ్రెస్ ముందు ఆప్ కొత్త షరతు పెట్టింది. రాహుల్ గాంధీని మూడోసారి నాయకుడిగా కాంగ్రెస్ ప్రదర్శించకూడదని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ అన్నారు. విపక్షాల విషయంలో కాంగ్రెస్ ఫోర్స్ చేయకూడదని పేర్కొంది. అందులో భాగంగా విపక్షాలు తమ నాయకుడిగా రాహుల్ గాంధీని ఎంచుకుంటే ఆప్ మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసింది. దీంతో కాంగ్రెస్ కి పెద్ద షాక్ తగిలినట్టైంది.

జూన్ 23న పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏర్పాటు చేసిన ప్రతిపక్ష పార్టీల మెగా సమావేశానికి ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆప్ రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్ హాజరయ్యారు. అయితే ఆప్ నేతలు మధ్యాహ్న భోజనం తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో ఆప్‌కి కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోతే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం చాలా కష్టమని ఢిల్లీ నుంచి ఆప్ ఒక ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు కేజ్రీవాల్ నేరుగా రాహుల్ గాంధీతో మాట్లాడి, విభేదాలు మరచి ముందుకు సాగాలని కోరారు.ఇక ఈ సమావేశానికి హాజరైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ విభేదాలను పరిష్కరించుకోవాలని ప్రతిపాదించారు.

Read More: PM Modi in Egypt: ఈజిప్టులో ప్రధాని మోదీ.. రెండో రోజు పూర్తి షెడ్యూల్ ఇదే..!