Site icon HashtagU Telugu

US EAD Cards : అమెరికాలోని ప్రవాస భారతీయులకు గుడ్ న్యూస్.. ‘ఈఏడీ’ కార్డ్స్ జారీకి గ్రీన్ సిగ్నల్

Us Ead Cards

Us Ead Cards

US EAD Cards : అమెరికాలో ఉంటున్న భారతీయులకు గుడ్ న్యూస్. నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీకి చెందిన పౌరులకు ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డ్‌లు(EAD) జారీ చేయాలని అమెరికా నిర్ణయించింది. గ్రీన్‌ కార్డ్‌ కోసం ఎదురు చూసే వాళ్లకూ ఈ కార్డ్‌లు ఇవ్వాలని డిసైడ్ చేసింది. ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డ్‌ ఐదేళ్ల పాటు చెల్లుతుంది.  ఈ నిర్ణయంతో వేలాది మంది భారతీయులకు మేలు జరగనుంది. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ (EAD) వ్యాలిడిటీని ఐదేళ్లకు పెంచుతున్నట్టు అమెరికా సర్కారు తెలిపింది. గ్రీన్‌ కార్డ్‌ కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తున్న వాళ్లకూ ఈ నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది. “అడ్జస్ట్‌మెంట్‌ ఆఫ్ స్టేటస్ అప్లికేషన్స్‌” తో సంబంధం లేకుండా ఐదేళ్ల వ్యాలిడిటీతో ఎంప్లాయ్‌మెంట్‌ కార్డ్‌లను అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ఇకపై జారీ చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఎంప్లాయ్‌మెంట్‌ కార్డుతో అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు. అమెరికాలో దాదాపు 10 లక్షల మంది భారతీయులు ఎంప్లాయ్‌మెంట్‌ బేస్డ్ గ్రీన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లు అన్నింటికీ ఇకపై ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డ్‌లు వర్తిస్తాయి.  గ్రీన్‌ కార్డ్ వస్తే అమెరికా పౌరసత్వం లభించినట్టే. H1B వీసాదారుల జీవిత భాగస్వాములు లేదా 21 ఏళ్ల లోపు యువతీ యువకులు అమెరికాలో జాబ్ చేయడానికి H4 వీసాలు ఇస్తారు. అయితే…వీళ్లు జాబ్ చేయాలంటే ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేన్ డాక్యుమెంట్స్ కోసం అప్లై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ పూర్తి కావాలంటే ఒక్కోసారి ఏడాది టైం పడుతుంది. ఇలాంటి వాళ్లకి ఇకపై ఇబ్బందులు తలెత్తకుండా ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డ్‌ల గడువును ఐదేళ్ల వరకూ పెంచారు.

Also Read: US VS Russia : ఆ దేశానికి ఓడ నిండా ఆయుధాలను పంపిన కిమ్!