కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు (Waqf Board) సవరణ బిల్లుపై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ (AIMIM chief Asaduddin Owaisi) ఈ బిల్లుపై తీవ్ర నిరసన తెలియజేశారు. ఈ సవరణ బిల్లుతో ముస్లింల మతపరమైన హక్కులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. వక్ఫ్ బోర్డు కీలకమైన ముస్లిం ఆస్తులను పరిరక్షించే సంస్థగా ఉండగా దాన్ని నిర్వీర్యం చేసేందుకు, పూర్తిగా నాశనం చేసేందుకు ఈ బిల్లు తెచ్చారని ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు.
UAE President Mohamed: 500 మంది భారతీయ ఖైదీలను విడుదల చేసేందుకు UAE ప్రధాని ఆదేశం
ప్రస్తుత NDA ప్రభుత్వంలో ఒక్క ముస్లిం ఎంపీ లేదా మంత్రి కూడా లేరని గుర్తు చేశారు. ముస్లింలకు రాజకీయంగా అవకాశాలు ఇవ్వకుండా, వారిని అణగదొక్కే విధంగా చర్యలు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. ముస్లిం అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయంలో వారి హక్కులను హరించేందుకు ఇలాంటి చట్టాలను తీసుకురావడం అన్యాయమని ఒవైసీ వ్యాఖ్యానించారు. ముస్లింలకు టికెట్లు కూడా ఇవ్వని ప్రభుత్వం, వారి ఇళ్లను బుల్డోజర్లతో కూలగొడుతుందని ఆరోపించారు.
CA Final Exams: సీఏ విద్యార్థులకు అలర్ట్.. ఇకపై పరీక్షలు ఏడాదికి మూడుసార్లు!
ఈ సవరణ బిల్లు ముస్లింల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని, దీనిపై ప్రతి ముస్లిం వ్యతిరేకత వ్యక్తం చేయాలని ఒవైసీ పిలుపునిచ్చారు. వక్ఫ్ బోర్డును బలహీనపరిచే ఏ నిర్ణయాన్నీ ముస్లింలు అంగీకరించరని, దీనికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం మతపరమైన వ్యవహారాల్లో ముస్లింల హస్తక్షేపాన్ని తొలగించేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ మార్పులు తెచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ముస్లిం సంఘాలు, నాయకులు, మరియు ప్రజలు కలిసి దీనిని అడ్డుకోవాలని ఆయన కోరారు.