Site icon HashtagU Telugu

Ambani: ముఖేష్ అంబానీ కాబోయే కొడలు బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్..?

Reliance Agm2 1

Reliance Agm2 1

Ambani: ఇండియాలో అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ చిన్న కుమారరుడు అనంత్ అంబానీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. తన స్నేహితురాలైన రాధిక మర్చంత్ తో అనంత్ అంబానీ త్వరలోనే ఏడడుగులు నడవనున్నాడు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం పూర్తయింది. రాజస్థాన్ లో గల నాథ్ ద్వారాలోని శ్రీనాథ్ జీ టెంపుల్ వీరి నిశితార్థం జరిగింది. కొంతమంది ప్రముఖులు మాత్రమే ఈ నిశ్చితార్థానికి హాజరయ్యారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో టాప్ 100లో ఉన్న ముఖేష్ అంబానీ ఇంటికి కొడలుగా వెళ్లడం అంటే మాములు విషయం కాదు. దీంతో అనంత అంబానీ కాబోయే బార్య రాధిక మర్చంట్ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఇంతకు ఎవరీ రాధిక మర్చంట్.. అనంత్ అంబానీతో ఎలా పరిచయం అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రాధిక మర్చంట్ డిసెంబర్ 18,1994న గుజరాతీ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ఉన్నారు. యాంకర్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఆమె తండ్రి చైర్మన్ గా ఉన్నారు. ఇఖ రాధిక మర్చంట్ మంచి క్లాసికల్ డ్యాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి రాజకీయ, ఆర్ధికశాస్త్రంలో ఆమె డిగ్రీ పూర్తి చేశారు. ఎనిమిదేళ్లు భరతనాట్యంలో ఆమె ట్రైనింగ్ తీసుకున్నారు. సాంప్రదాయ నృత్యాలు అంటే ఆమెకు చాలా ఇష్టం అని చెబుతున్నారు.

ఇక రాధిక మర్చంట్ సెలబ్రెటీ పార్టనర్ గా, ప్రముఖ వ్యాపారవేత్తగా కూడా పాపులర్ అయ్యారు. ఎప్పటినుంచో అనంత్ అంబానీ, రాధిక మధ్య పరిచయం ఉంది. ఆ పరిచయం ఇప్పుడు పెళ్లి వరకు వచ్చిందని చెబుతున్నారు.ఏది ఏమైనా ముకేష్ అంబానీ లాంటి ఫ్యామిలీలోకి ఒకరిగా అడుగుపెడుతుందంటే రాధిక ఎంతో లక్కీ కదా..