Amartya Sen : ఎలక్టోరల్ బాండ్ల రద్దు సరైందే.. నోబెల్ గ్రహీత అమర్య్తసేన్ కామెంట్స్

Amartya Sen : ఎలక్టోరల్ బాండ్ల జారీ వ్యవస్థను రద్దు చేస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్ ప్రైజ్ విజేత అమర్త్యసేన్ స్వాగతించారు.

  • Written By:
  • Publish Date - February 26, 2024 / 04:27 PM IST

Amartya Sen : ఎలక్టోరల్ బాండ్ల జారీ వ్యవస్థను రద్దు చేస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్ ప్రైజ్ విజేత అమర్త్యసేన్ స్వాగతించారు. ఎన్నికలు సమీపించిన వేళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు  ఎన్నికల నిర్వహణ వ్యవస్థలోని పారదర్శకతకు మరింత పెంచిందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాలోని మసాచుసెట్స్‌లో సోమవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో అమర్త్యసేన్ ఈ కామెంట్స్ చేశారు. ‘ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పెద్ద కుంభకోణం. దానిని రద్దు చేసినందుకు సంతోషిస్తున్నా. ఇది మరింత సుపరిపాలన అందించేందుకు ఉపయోగపడుతుంది’ అని ఆయన చెప్పారు. రాజకీయాల స్వభావం వల్ల భారతదేశ ఎన్నికల వ్యవస్థ గణనీయంగా ప్రభావితమైందని అమర్త్యసేన్ ఆవేదన వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join

భారత్‌లో ప్రత్యర్థి పార్టీల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందనే దానిపై ఈ సమస్య ఆధారపడి ఉంటుందన్నారు. స్వేచ్చా యుత ఎన్నికల సిస్టమ్ కలిగి ఉండాలని భావిస్తున్నట్టు ఆయన  తెలిపారు. భారత రాజ్యాంగం పౌరులందరికీ గణనీయమైన రాజకీయ స్వేచ్ఛను ఇవ్వాలని కోరుకుంటుందని, ఏ సమాజం కూడా ప్రత్యేక హోదాను కలిగి ఉండకూడదని అమర్త్యసేన్ (Amartya Sen) స్పష్టం చేశారు. ‘‘భావప్రకటనా స్వేచ్ఛ, సమాచార హక్కుకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఎలక్టోరల్ బాండ్ల జారీ పథకం ఉల్లంఘిస్తోంది’’ అని పేర్కొంటూ ఆ స్కీంను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Also Read : LRS Scheme : ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై రేవంత్ సర్కారు కీలక నిర్ణయం