పంజాబ్ సీఎం సిద్ధూ? అమ‌రేంద్ర‌సింగ్ రాజీనామా సింగ్ పై బీజేపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్

  • Written By:
  • Publish Date - September 18, 2021 / 05:18 PM IST

పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ముదిరింది. ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి అమ‌రేంద్ర‌సింగ్ రాజీనామా చేశాడు. ఆ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ బ‌న్వ‌ర్ లాల్ పురోహిత్ కు రాజీనామా ప‌త్రాన్ని అంద‌చేశారు. రాజీనామాకు ముందుగా 12 మంది అత్యంత స‌న్నిహిత ఎమ్మెల్యేల‌తో సింగ్ స‌మావేశం అయ్యారు. వాస్త‌వంగా కొద్దిసేప‌ట్లో సీఎల్పీ స‌మావేశం జ‌ర‌గాల్సి ఉండ‌గా, ఆ లోపుగానే సింగ్ రాజీనామా నిర్ణ‌యం తీసుకున్నారు. అమ‌రేంద్ర‌సింగ్ ను త‌మ పార్టీలోకి తీసుకోవ‌డానికి బీజేపీ స‌న్న‌ద్ధం అవుతోంది. ఆ మేర‌కు ఢిల్లీ నుంచి బీజేపీ సీనియ‌ర్లు పావులు క‌దుపుతున్నారు. కాంగ్రెస్ సీనియ‌ర్లు క‌మ‌ల్ నాథ్, మ‌నీష్ కుమార్లు రంగంలోకి దిగారు. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్పుడు ప‌రిస్థితుల్లో పార్టీలో కొన‌సాగ‌లేన‌ని సింగ్ తేల్చేశారు.

పంజాబ్ లోని కాంగ్రెస్ సంక్షోభాన్ని నివారించేందుకు అజ‌య్ మెకెన్ హుటాహుటిన వెళ్లారు.సీఎల్పీ మీటింగ్ ను నిర్వ‌హించిన త‌రువాత లీడ‌ర్ ను ఎన్నుకుంటారు. సింధూ లేదా జాక‌ర్ ను సీఎల్పీ లీడ‌ర్ గా ఎంపిక చేసుకునే అవ‌కాశం ఉంది. అమ‌రేంద్ర‌సింగ్ మీద 40 మందికి పైగా ఎమ్మెల్యేలు తిర‌గ‌బ‌డ్డారు. ఆమేరకు ఏఐసీసీకి లేక రాయ‌డం మ‌న‌కు తెలిసిందే. దీంతో సీరియ‌స్ ను గ‌మ‌నించిన అధిష్టానం న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు దిగింది. కానీ, సీఎల్పీ మీటింగ్ కు క‌నీసం 40 మంది ఎమ్మెల్యేలు హాజ‌రు అయ్యే అవ‌కాశం లేద‌ని తెలుసుకున్న సింగ్ ముందుగానే రాజీనామా చేశారు.

సమీప భ‌విష్య‌త్ లోనే పంజాబ్ ఎన్నిక‌లు ఉన్నాయి. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల‌ను జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇలాంటి సంక్షోభం కాంగ్రెస్ లో నెల‌కొంది. తొలి నుంచి సిద్ధూ, సింగ్ మ‌ధ్య రాజ‌కీయ వివాదాలు ఉన్నాయి. బీజేపీ నుంచి సిద్ధూ కాంగ్రెస్లోకి వ‌చ్చిన వెంట‌నే ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఆశించారు. కానీ, సింగ్ కు సీఎం ప‌ద‌విని అధిష్టానం క‌ట్ట‌బెట్టింది. పీసీసీ చీఫ్ గా సిద్ధూ ఉన్నారు. వీళ్ల‌ద్ద‌రి మ‌ధ్య రాజ‌కీయ పంచాయ‌తీ తారాస్థాయికి చేర‌డంతో కాంగ్రెస్ సంక్షోభంలోకి వెళ్లింది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చ‌త్తీస్ గ‌డ్, పంజాబ్ ల‌లో సంక్షోభం నెల‌కొంది. ఇక రాజ‌స్తాన్ లోనూ కాంగ్రెస్లో అంత‌ర్గ‌త కుమ్ములాట ఉంది. ఈ క్ర‌మంలో రాబోయే ఎన్నిక‌ల‌ను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది పెద్ద ప్ర‌శ్న‌. కాంగ్రెస్ ముక్త్ భార‌త్ దిశ‌గా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల‌ను కోల్పోయిన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ సంక్షోభాన్ని కొని తెచ్చుకుంటోంది. పంజాబ్ సంక్షోభానికి ప‌డే తెర మీద వ‌చ్చే ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆధార‌ప‌డ‌తాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా. గ్రూపు రాజ‌కీయాల‌కు పేరుగా ఉన్న కాంగ్రెస్ వాటి వ‌ల్లే భారీగా న‌ష్ట‌పోతోంది. ఇలాంటి పరిణామాలు కొన‌సాగితే, బీజేపీ ల‌క్ష్యం కాంగ్రెస్ ముక్త్ భార‌త్ ఎంతో దూరం ఉండ‌దు. ఇప్ప‌టికైనా ముఖ్య‌మంత్రుల‌ను మార్చే సంస్కృతి నుంచి కాంగ్రెస్ బ‌య‌ట‌ప‌డుతుంద‌ని ఆశిద్దాం.